Weight Loss Tips: ఈ ఒక్క పనిచేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గుతారు..

Published : Jun 03, 2022, 12:41 PM IST

Weight Loss Tips: బిజీ లైఫ్ స్టైల్ కారణంగా బరువు తగ్గేందుకు జిమ్ లకు వెళ్లే సమయం దొరకడం లేదు. కానీ బరువు తగ్గాలనుకునే వారు ఒక పనిని చేస్తే సులువుగా బరువు తగ్గుతారు. అదేంటంటే. 

PREV
17
Weight Loss Tips: ఈ ఒక్క పనిచేస్తే జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గుతారు..

Weight Loss Tips: కరోనా వైరస్ మహమ్మారి ఎంట్రీ తర్వాత లాక్ డౌన్ తో వర్క్ ఫ్రం హోం కల్చర్ బాగా పెరిగింది. దీంతో చాలా మంది వేగంగా బరువు పెరిగారు. బరువు పెరిగినంత ఈజీగా తగ్గడం మాత్రం సాధ్యం కాదు. ఇది స్లోగా జరిగే ప్రాసెస్. 

27

బరువు తగ్గేందుకు కఠినమైన ఆహారం తీసుకోవడంతో పాటుగా జిమ్ సెంటర్లలో చెమటలు చిందించాల్సిందేనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి జిమ్ లో కసరత్తులు చేసినా బరువు తగ్గుతారు. కానీ జిమ్ కష్టపడాల్సిన అవసరం లేకుండానే సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

37

జిమ్ కు వెళ్లకుండానే బరువు తగ్గాలంటే.. బరువు తగ్గేందుకు వ్యాయామాలు, స్పెషల్ డైట్ ను ఫాలో అవ్వడంతో పాటుగా.. నీళ్లను కూడా బాగా తాగాలని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఎందుకంటే నీళ్లు కూడా బరువు తగ్గేందుకు సహాయపడతాయి కాబ్టటి. నీళ్లను  ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రెటెడ్ గా ఉండటంతో పాటుగా ఎన్నో రోగాలు సైతం దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

47

నీళ్లు బరువు తగ్గడానికి సహాయపడతాయి.. నీళ్లు తాడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటంతతో పాటుగా.. ఆహారం ద్వారా అందిన పోషకాలు వివిధ కణాలకు చేరడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు.. శరీరంలో ఉండే విషపదార్థాలను సైతం తొలగించడానికి సహాయపడుతుంది. 
 

57

నీళ్లు తాగడం వల్ల జీవక్రియతో సహా జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగితే సులువుగా బరువు తగ్గుతారు.

67

నీళ్లతో బరువు ఎలా తగ్గుతుంది.. తినడానికి ముందు నీళ్లను తాగితే.. మీరు ఫుడ్ ను ఎక్కువగా తినలేరు.దీనివల్ల కేలరీలు కూడా తగ్గుతాయి. ప్రతిరోజూ ఇలాగే జరిగితే.. మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. అయితే దీనితో పాటుగా ఆయిలీ ఫుడ్ ను, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. నీళ్ల వల్ల బరువు తగ్గడమే కాదు.. మీ ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. 
 

77

నీళ్లను తాగకుండా ఉండకూడదు.. తగినంత నీరు తాగకపోతే శరీరంలోని కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు సరిగ్గా జీవక్రియ చేయబడవు. కొవ్వు జీవక్రియ (Metabolism) చేయబడినప్పుడు ఈ ప్రక్రియను లిపోలిసిస్ అంటారు. ఇలా జరగకూడదంటే నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!

Recommended Stories