నోరోవైరస్ అంటే ఏంటి? దీని లక్షణాలు, వ్యాప్తి, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం

First Published Jan 24, 2023, 4:06 PM IST

నోరోవైరస్ ఒక అంటువ్యాధి. దీనివల్ల విరేచనాలు, వాంతులు అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్కు అత్యంత సాధారణ కారణం.
 

norovirus

కేరళలోని ఎర్నాకుళం జిల్లా కక్కనాడ్ లోని ఓ పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొంతమంది తల్లిదండ్రులకు కూడా ఈ వైరస్ సోకినట్టు సమాచారం. అయితే  ఇందులో ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్నారని.. వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దీంతో పాఠశాల రెగ్యులర్ తరగతులను నిలిపివేసినప్పటికీ.. ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నట్లు సమాచారం. భారత్ లో నోరోవైరస్ కేసులు నమోదు కావడం ఇది మొదటిసారేం కాదు.  గత ఏడాది కూడా కేరళ, కర్ణాటకలో పలు కేసులు నమోదయ్యాయి. 

నోరోవైరస్ అంటే ఏమిటి?

నోరోవైరస్ ఒక అంటువ్యాధి. ఇది విరేచనాలు, వాంతులకు కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. నోరోవైరస్ అనేది వైరల్ అనారోగ్య సమస్య. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ కు అత్యంత సాధారణ కారణం. దీనిని సాధారణంగా 'ఫుడ్ పాయిజనింగ్' అని కూడా అంటారు. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం, కలుషితమైన ఆహారాన్ని తినడం లేదా కలుషితమైన ఉపరితలాన్ని తాకడం, చేతులు కడుక్కోకుండా నోటిలో పెట్టుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. 
 

నోరోవైరస్ లక్షణాలు:  యునైటెడ్ స్టేట్స్ లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సిడిసి), ప్రివెన్షన్ ప్రకారం.. నోరోవైరస్ సోకిన వ్యక్తికి ఉండే అత్యంత సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి. 


నీళ్ల విరేచనాలు
వాంతులు
వికారం, వాంతులు వచ్చేలా ఉండటం
కడుపు నొప్పి
తలనొప్పి
శరీర నొప్పి
 

Norovirus

నోరోవైరస్ సంక్రమణ సాధారణంగా మీకు సోకిన తర్వాత ఒకటి నుంచి రెండు రోజుల వరకు ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలేం రావు. అయినప్పటికీ. ఇది చిన్న వయసు వారిలో, వృద్ధులలో నిర్జలీకరణానికి కారణమవుతుంది. అయితే ఈ వ్యాధిసోకిన కొంతమంది వారం రోజుల పాటు బలహీనంగా ఉంటారు. 


నోరోవైరస్ నుంచి నివారణ

మీ చేతులను సబ్బు, నీటితో తరచుగా, బాగా కడగాలి. ముఖ్యంగా టాయిలెట్ కు వెళ్లి వచ్చిన తర్వాత, వంటకు ముందు ఖచ్చితంగా చేతులను శుభ్రంగా కడగండి. 

కలుషితమైన ఉపరితలాలు లేదా వస్తువులను క్రిమిసంహారకం చేయండి. 

టాయిలెట్ లో సరైన ఫ్లషింగ్, దాని చుట్టుముట్ట శుభ్రం చేయండి

ముడి, కడగని ఆహారాలను తినడం మానుకోండి. 

నోరోవైరస్ చికిత్స

ప్రస్తుతానికి.. నోరోవైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులేమీ లేవు. ఈ వ్యాధి సోకి వారు నీటిని పుష్కలంగా తాగాలి. ఇతర ద్రవాలను తాగాలని సిడిసి సూచిస్తోంది. ఎందుకంటే వాంతులు, విరేచనాల తో కోల్పోయిన ద్రవాన్ని భర్తీ చేయాలి. ఇది డీహైడ్రేషన్ ను నివారించడానికి సహాయపడుతుంది. 

click me!