పిల్లల్లో థైరాయిడ్.. కొన్ని ముఖ్యమైన లక్షణాలు

First Published Jan 24, 2023, 1:56 PM IST

థైరాయిడ్ గ్రంథి రుగ్మతలు మన శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయి. ఈ థైరాయిడ్ సమస్యలు కేవలం పెద్దలకే కాదు చిన్నపిల్లలకు కూడా వస్తాయి. అందుకే వారిలో ఈ లక్షణాలు ఉండే వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లడం మంచిది. 

మన శరీరం సక్రమంగా పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులు కేవలం పెద్దలలోనే కాదు పిల్లల్లో కూడా కనిపిస్తాయి. ఈ హార్మోన్ పిల్లలకు వారి అభిజ్ఞా అభివృద్ధికి, సరైన శారీరక, మానసిక అభివృద్ధికి సహాయపడుతుంది. వారు పెరుగుతున్న వయస్సులో సంతానోత్పత్తికి ఈ హార్మోన్ చాలా అవసరం. కాబట్టి పిల్లల్లో థైరాయిడ్ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 
 

thyroid kids

థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా యుక్తవయసు వారికే వస్తుంటాయి. ఇక స్కూల్ వయస్సు పిల్లలలో ఎండోక్రైన్ రుగ్మత సర్వసాధారణమైనది. సుమారు 1,000 మంది పిల్లలలో 37 మందికి థైరాయిడ్ వ్యాధి ఉందని సర్వేల అంచనా. అసలు పిల్లల్లో ఈ థైరాయిడ్ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పిల్లల్లో హైపర్ థైరాయిడిజం లక్షణాలు

చేతులు వణకడం
ఏకాగ్రత లేకపోవడం 
హృదయ స్పందన రేటు పెరగడం
అధిక చెమట
నిద్ర సమస్యలు
బరువు తగ్గడం
ఉబ్బిన కళ్లు
మలబద్దకం
మూర్చ
వదులైన మలం
 

పిల్లలు, యుక్తవయసు వారిలో హైపర్ థైరాయిడిజం అత్యంత సాధారణ కారణం గ్రేవ్స్ వ్యాధి అని పిలువబడే స్వయం ప్రతిరక్షక పరిస్థితి. ఇది థైరాయిడ్ గ్రంధిని అనియంత్రితంగా ప్రేరేపించే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్కువ థైరాయిడ్ హార్మోన్‌ను తయారు చేస్తుంది.

ఒంట్లో శక్తి తగ్గడం
వాపు లేదా ఉబ్బినట్టుగా కనిపించడం
ఆకలి పెరగడం
ఆకలి లేకుండా బరువు పెరగడం
కండరాల నొప్పి
మలబద్ధకం లేదా గట్టి మలం 
పెళుసైన జుట్టు 
పొడి చర్మం

పిల్లలు, యుక్తవయసులో హైపోథైరాయిడిజం అత్యంత సాధారణ కారణం హషిమోటోస్ థైరాయిడిటిస్ అని పిలువబడే స్వయం ప్రతిరక్షక పరిస్థితి. ఇది థైరాయిడ్ గ్రంధిపై దాడి చేసి నాశనం చేసే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా తక్కువ థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.


నిజానికి ఈ థైరాయిడ్ సమస్యలను సాధారణంగా మందులతో సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ పిల్లల్లో ఈ లక్షణాలలో కొన్నైనా కనిపిస్తే  శిశువైద్యుడిని సంప్రదించండి. 

click me!