మన దేశంలో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డయాబెటిస్ ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. దీనికి సకాలంలో చికిత్స చేయించుకోలేకపోతే హృదయ సంబంధ సమస్యలు, వేళ్లు, కాలిలోని నరాల నష్టం, మూత్రపిండాల రుగ్మతలు, కంటి సమస్యలు, పేలవమైన రక్త ప్రవాహం, పాదాలలో నరాలోని దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ డయాబెటీస్ గాయాల నుంచి తీవ్రమైన సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది.