ఎం ఆధార్ యాప్
ప్రస్తుతం దాదాపు అన్ని చోట్లా ఆధార్ తప్పనిసరి అయింది. అందువల్ల ప్రజల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకువచ్చింది. దానికి అనుగుణంగానే భారతదేశంలో కొత్త ఆధార్ యాప్ ప్రారంభించారు. ఇందులో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే ఎం ఆధార్ యాప్. ఈ యాప్ ఫోన్‌లో ఉంటే ఇక చింత లేదు. అందులో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి మీ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు.
ఎం ఆధార్ యాప్
UIDAI రూపొందించిన ఈ యాప్ పేరు ఎం ఆధార్. ఈ పద్ధతి ద్వారా ఆధార్‌ను మునుపటి కంటే సులభంగా మరియు వేగంగా ధృవీకరించవచ్చు. ఆసుపత్రి నుండి పరీక్షా కేంద్రం వరకు, ప్రయాణం చేసేటప్పుడు లేదా బ్యాంకులో ఆధార్ కార్డ్ తీసుకెళ్లడం మర్చిపోతే ఇక చింత లేదు. ఈ యాప్ మొబైల్‌లో ఉంటే చాలు.
QR కోడ్, ఫేస్ ఆథెంటికేషన్
ఈ ఎం ఆధార్ యాప్‌లో QR కోడ్, ఫేస్ ఆథెంటికేషన్ సౌకర్యం ఉంది. స్కాన్ చేస్తే మీ ఫోటోతో సహా మీ గుర్తింపు పత్రం కనిపిస్తుంది. వేలిముద్రలు, కంటి స్కాన్, ఫోటో కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఆధార్ యాప్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. హోటల్, దుకాణం, బ్యాంకు వంటి ప్రదేశాలలో గుర్తింపు కోసం ఆధార్ ఫోటో కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
సమాచారం సురక్షితం
మీ వ్యక్తిగత సమాచారం అంతా సురక్షితంగా ఉంటుంది. కేవలం డిజిటల్‌గా మాత్రమే ఉంటుంది. ఆ సమాచారాన్ని ఎవరూ తీసుకోలేరు. మీ వేలిముద్రలు మరియు కంటి స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఫోటో కాపీని ఉపయోగించి అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. వాటిని ఆపవచ్చు. ఆధార్ కార్డ్ షేర్ చేయడానికి చాలా మంది భయపడుతుంటారు. కానీ, ఇక ఆ చింత లేదు. ఎవరూ మీ ఆధార్ కార్డ్ తీసుకోలేరు. ఈ యాప్ ద్వారా పని తేలిక అవుతుంది కాబట్టి సమయం కూడా కలిసి వస్తుంది.