చల్లని ప్రదేశంలో ఉంచాలి..
మీరు పెరుగును ఉంచే ప్రదేశం చాలా ముఖ్యం. సూర్యరశ్మి తగిలేలా, వేడి గా ఉండే ప్రదేశంలో పెరుగు ఉంచకూడదు. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో మాత్రమే మీరు పెరుగు నిల్వ ఉంచాలి. వీలైతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే.. అందులోనే ఉంచడం ఉత్తమం. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశంలో బ్యాక్టీరియా పెరుగుదల తక్కువగా ఉంటుంది. అందుకే, తొందరగా పెరుగు పులిసిపోదు.
గాలి చొరబడని కంటైనర్లను ఉపయోగించండి:
పెరుగును ప్లాస్టిక్ గిన్నెలో నిల్వ చేయడానికి బదులుగా, గాలి చొరబడని గాజు లేదా సిరామిక్ కంటైనర్‌కు బదిలీ చేయండి. ఇది గాలి, తేమకు గురికాకుండా నిరోధిస్తుంది, ఇది పెరుగు ఎక్కువసేపు తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.