ఖాళీ పొట్టతో అన్ని ఆహారాలను (Empty Stomach Foods) తినడానికి వీల్లేదు. కొన్ని రకాల పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం ఖాళీ పొట్టతో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇక్కడ ఇచ్చాము.
రోజును ప్రారంభించేటప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలనే ఎంపిక చేసుకోవాలి. చాలామంది టీ లేదా కాఫీతోనే రోజును ప్రారంభిస్తారు. అవి మంచివి కాదని చెప్పినా కూడా ఆ అలవాటును మార్చుకోలేకపోతున్నారు. టీ, కాఫీలే కాదు ఉదయం పూట ఖాళీ పొట్టతో తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని తింటే కొన్ని రోజుల్లోనే జీర్ణ వ్యవస్థ అనారోగ్యం పాలవుతుంది. జీవక్రియ కూడా మందగిస్తుంది. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, హెపటాలజిస్టులు చెబుతున్న ప్రకారం ఉదయం పూట ఖాళీ పొట్టతో పొరపాటున కూడా తినకూడని ఆహారాల గురించి ఇక్కడ ఇచ్చాము.
25
పుల్లని పండ్లు
నిజానికి సిట్రస్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తాయి. కానీ ఖాళీ పొట్టతో మాత్రం నిమ్మ, నారింజ వంటి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే పండ్లను తినకూడదు. ఈ పుల్లని పండ్లను ఉదయం పూట ఖాళీ పొట్టతో తింటే పొట్టలోని పొరలకు చికాకుగా అనిపిస్తుంది. ఆ లైనింగ్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. దీని వలన పొట్ట సమస్యలు అధికంగా వస్తాయి.
35
బ్లాక్ కాఫీ
చాలామంది బ్లాక్ కాఫీని తాగడం మంచిదంటారు. అందులో కెఫీన్ కూడా ఉండదని అంటారు. అది నిజమే కావచ్చు.. కానీ ఉదయం పూట ఖాళీ పొట్టతో మాత్రం బ్లాక్ కాఫీని తాగ కూడదు. అది పొట్టలోని ఆమ్లాలకు ఇబ్బందిని కలిగిస్తుంది. దీనివల్ల కడుపుబ్బరంగా, నీరసంగా అనిపించడం, బలహీనంగా మారడం, చికాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఉదయాన్నే అల్పాహారంలో పూరీలు, కచోరీలు వంటివి తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. నూనెలో వేయించిన గారెలు కూడా తినకూడదు. అయినా కూడా పూరీలు, గారెలతోనే అల్పాహారాన్ని మొదలుపెట్టేవారు ఎంతోమంది. ఇవి భారీ ఆహారాల జాబితాలోకి వస్తాయి. వీటిని ఉదయం పూట తినడం వల్ల జీర్ణవ్యవస్థ పై ఒత్తిడి అధికమైపోతుంది. పేగు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
55
వీటిని తింటే మంచిది
పైన ఖాళీ పొట్టతో ఉదయం పూట ఏమీ తినకూడదో తెలుసుకున్నాము. ఇప్పుడు ఏమి తినాలో తెలుసుకోండి. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ తో మీ రోజున ప్రారంభిస్తే ఎంతో మంచిది. అలాగే దోశ, చట్నీ లేదా దోశ సాంబార్, అరటి పండ్లు, ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్లు, ఓట్స్ వంటివి ఖాళీ పొట్టతో తింటే ఎంతో ఆరోగ్యం కావడం కూడా సులభం.