మధుమేహులు కొబ్బరి నీళ్లను తాగొచ్చా? లేదా?
కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర ఉంటుంది. అందుకే ఇవి కొద్దిగా తీయగా ఉంటాయి. అందుకే కొంతమంది డయాబెటీస్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగరు. ఎక్కడ ఈ నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయో అని. గ్రేటర్ నోయిడాలోని జీఐఎంఎస్ హాస్పటల్ లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ జీ న్యూస్ తో ఇలా అన్నారు.. నిజానికి కొబ్బరి నీళ్లు మధుమేహులకు చాలా మంచివి. ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయిట. ఈ విషయం జంతువులపై చేసిన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి మధుహులకు ఎలాంటి హాని కలిగించవు. డాక్టర్ సలహాతీసుకుని మధుమేహులు కొబ్బరి నీళ్లను తాగొచ్చు.