డ్రై స్కిన్, ముఖంపై నల్లని మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి

First Published Oct 1, 2022, 4:54 PM IST

కీరదోస చర్మ రంగును పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీన్ని రసాన్ని ముఖానికి, మెడకు రాయడం వల్ల నలుపుదనం పోతుంది. 
 

face packs

కీరదోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్,పొటాషియం, కాల్షియం, మినరల్స్, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయ శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. 

cucumber

కీర దోసకాయల్లో 95 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ చర్మం, బాడీ హైడ్రేట్ గా ఉంటాయి.  దీనివల్ల వడదెబ్బ కొట్టే ప్రమాదం తగ్గుతుంది. ఈ కీర దోసకాయ చర్మ రంగును పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కీరదోసకాయ రసాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఒక అరగంట తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ కీర రసానికి నిమ్మరసం కలిపి వాడితే ఇంకా మంచిది. 

కొందరి చర్మం డ్రై గా, డల్ గా ఉంటుంది. ఇలాంటి వారికి కీరా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కీర నుంచి రసాన్ని తీసి దానికి కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే నల్లని మచ్చలను, కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాల్ని తొలగిస్తుంది. కీర రసాన్ని కళ్లచుట్టూ అప్లై చేసినా.. లేదా కీరాలను గుండ్రంగా కట్ చేసి కళ్లపై పెట్టినా బ్లాక్ సర్కిల్స్ వదిలిపోతాయి. కీర రసాన్ని ముఖంపై నల్లటి మచ్చలకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే అవి తొందరగా తొలగిపోతాయి. 
 

చుండ్రును వదిలించుకోవడానికి కీర రసం, టమోటా రసం ఉపయోగపడతాయి. కీరదోసకాయ రసంలో కొద్దిగా గంధం పొడి, కాయధాన్యాల పొడి, కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాయడం వల్ల జిడ్డు చర్మం వదిలిపోతుంది. స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది. కీరదోసకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్స్ ముడుతలను పోగొడుతుంది.

కీరదోసకాయ రసానికి చిటికెడు పంచదార కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేందుకు కీరదోసకాయ రసాన్ని మాడుకు అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి.
 

ఇకపోతే కీరదోసకాయను తినడం వల్ల శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ బయటకుపోతాయి. అలాగే కిడ్నీ రాళ్లు కూడా కరిగిపోతాయి. అంతేకాదు కాదు అసలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదమే తప్పుతుంది. కీరదోసలో ఉండే ఔషదగుణాలు బ్రెస్ట్, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను నివారిస్తాయి. స్టమక్ అల్సర్ కూడా తగ్గుతుంది. కీరాలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లు హైబీపీని తగ్గిస్తాయి. వీటిలో ఉండే వాటర్ కంటెంట్, విటమిన్ బి తలనొప్పిని తగ్గిస్తాయి. హ్యాంగోవర్ కూడా తగ్గుతుంది. 

click me!