Bad Breath: నోట్లో నుంచి వాసన వస్తోందా? ఇలా చేయండి అస్సలు రాదు

Published : Sep 28, 2025, 11:06 AM IST

Bad Breath: ఈ రోజుల్లో చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య చిన్నదే అయినా దీనివల్ల నలుగురిలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే దీన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

PREV
15
నోట్లో నుంచి వాసన వస్తోందా?

నోటి దుర్వాసన చాలా మందికి ఉన్న కామన్ సమస్య. ఇది చిన్నదే అయినా దీన్ని ఎలా తగ్గించుకోవాలో చాలా మందికి తెలియదు. కానీ దీనివల్ల నలుగురిలో బిగ్గరగా నవ్వడానికి, మాట్లాడటానికి కూడా సిగ్గుపడుతుంటారు. ఈ వాసన వల్ల ఎవరు వెక్కిరిస్తారోనని. ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ నోటి దుర్వాసనను పోగొట్టడానికి ఎలాంటి టిప్స్ ను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
నోటి దుర్వాసనను పోగొట్టే చిట్కాలు

నీళ్లను పుష్కలంగా తాగాలి

మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే నీళ్లను పుష్కలంగా తాగాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లను తాగాలి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు నీళ్లను పుష్కలంగా తాగడం వల్ల నోటి దుర్వాసన చాలా వరకు తగ్గుతుంది. నీళ్లను తాగడం వల్ల పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహార కణాలు, బ్యాక్టీరియా తొలగిపోతాయి. దీంతో చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే నీటి వల్ల నోట్లోని ఆమ్లం పలుచగా అవుతుంది. దీంతో పళ్లపై ఎనామిల్ నాశనం అవుతుంది. అలాగే దంతక్షయం సమస్య తగ్గి నోరు ఆరోగ్యంగా, దుర్వాసన రాకుండా ఉంటుంది.

నాలుకను శుభ్రం చేసుకోవాలి

నోట్లో నుంచి వాసన రాకుండా ఉండాలంటే నాలుకను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మన నాలుకపై ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఇదే నోట్లో నుంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా పోవాలంటే నాలుకను సరిగ్గా క్లీన్ చేసుకోవాలి. బ్రష్ తో నాలుకను క్లీన్ చేసుకుని నోటిని శుభ్రంగా నీళ్లతో కడిగితే మీ నోట్లో నుంచి వాసన రాదు. ఆ తర్వాత బ్రష్ ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

35
పండ్లను, కూరగాయలను బాగా తినాలి

పండ్లు, కూరగాయలను పుష్కలంగా తింటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ శ్వాస కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అవును పండ్లు, కూరగాయలు నోట్లో నుంచి దుర్వాసన రాకుండా చేస్తాయి. ఇందుకోసం క్యారెట్లు, ఆపిల్, సెలెరీ వంటి ఆహారాలను తినండి. ఇవి అచ్చం టూత్ బ్రష్ లాగే పనిచేస్తాయి. 

అంటే నాలుక, దంతాలపై ఉన్న బ్యాక్టీరియాను తొలగించేందుకు సహాయపడతాయి. వీటిని తింటుంటే నోట్లో లాలాజలం పెరిగి చెడు వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ద్రాక్షలు, నిమ్మకాయ, ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను తిన్నా మంచిదే. వీటిలోని విటమిన్ సి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నోట్లో లాలాజల ఉత్పత్తిని పెంచి నోటి దుర్వాసనను తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఉప్పు నీటితో శుభ్రం చేయండి

ఉప్పు నీళ్లతో కూడా నోటిని శుభ్రం చేస్తే వాసన రాదు. ఇది చాలా సింపుల్ పద్దతి. గోరువెచ్చని ఉప్పు నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరగడం ఆగిపోతుంది. అలాగే మంట, దంతాలపై ఫలకం ఏర్పడటం తగ్గుతుంది. ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి, కావిటీస్, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఉప్పును వేసి నోట్లో 30 సెకన్ల పాటు ఉంచి బయటకు ఉమ్మివేయండి. లేదా ఈ నీళ్లతో పుక్కిలించండి. ఇలా వీలైనన్ని సార్లు చేయండి. కానీ వీటిని తాగకూడదు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది.

45
స్మోకింగ్ మానేయండి

స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు రావడమే కాదు.. దంతాలు పసుపు పచ్చగా అవుతాయి. అలాగే నోట్లో నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అలాగే హాలిటోసిస్ వ్యాధి కూడా వస్తుంది. మీరు గనుక స్మోకింగ్ మానేస్తే నోటి దుర్వాసన పోతుంది. 

మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్మోకింగ్ వల్ల నోరు పొడిబారి లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నోట్లో నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. పొగ వల్ల కూడా నోట్లో నుంచి వాసన వస్తుంది. అందుకే స్మోకింగ్ ను మానేయడం మంచిది.

బేకింగ్ సోడా మౌత్ రిన్స్

బేకింగ్ సోడాతో కూడా నోట్లో నుంచి చెడు వాసన రాకుండా చేయొచ్చు. బేకింగ్ సోడా నోట్లోని ఆమ్లాలను సమతుల్యంగా ఉంచుతుంది. దీంతో నోట్లో నుంచి వాసర రావడం తగ్గుతుంది. ఇందుకోసం సగం టీ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ వాటర్ లో వేసి కలపాలి. దీన్ని నోట్లో 30 సెకన్ల పాటు ఉంచి పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే నోట్లో నుంచి వాసన రాకుండా ఉంటుంది.

55
డెంటల్ హాస్పటల్ కు వెళ్లాలి

ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారైనా డెంటల్ డాక్టర్ల దగ్గరకు వెళ్లాలి. అప్పుడే మీ నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉంటారు. దీంతో మీ నోట్లో నుంచి వాసన రావడం కూడా తగ్గుతుంది. అలాగే నోటి దుర్వాసన ఎందుకు వస్తుందో తెలు్తుంది. డెంటల్ హాస్పటల్ కు వెళ్లడం వల్ల ఫలకం పోయి దంతాలు శుభ్రపడతాయి. ఇదే నోటి దుర్వాసనకు కారణమవుతుందని డాక్టర్లు చెప్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories