ఎక్కడైనా సరే ఆడవాళ్లు నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. సాధారణ రోజుల్లో ఆడవాళ్లు సామాజికంగా కలుసుకునే అవకాశాలు చాలా తక్కువ. కానీ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు మాత్రం పేద, ధనిక, చిన్నా, పెద్దా వంటి తేడాలు లేకుండా మహిళలందరూ కలిసి, పూలతో బతుకమ్మను పేర్చుకొని భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ పండుగ జరుపుకుంటారు. ఇది మహిళా శక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా పాడే పాటలు కూడా తెలంగాణ మహిళల భావాలను, వేదనలను, ఆశయాలను వ్యక్తపరుస్తాయి.