
పోషకాహారాన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేసేందుకు ప్రతి ఏడాది మన దేశంలో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ ను జరుపుకుంటారు. సమతుల్య, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయని నిపుణులు పదేపదే చెప్తూ వస్తున్నారు. అయినా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాన్నే ఆహారాలనే ఎక్కువగా తింటున్నారు.
సాధారణంగా మనలో చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం కంటే ఆయిలీ, స్పైసీ, స్వీట్ ఫుడ్ ను తినడానికే ఇష్టపడతారు. కానీ ఈ కరోనా కాలంలో ఇలాంటి ఫుడ్ వల్ల మీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. ఇవి రోగాలను అడ్డుకునే ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తాయి. అందుకే ఇమ్యూనిటీ వ్యవస్థను బలంగా ఉంచే ఆహారాలనే తినండి. అయితే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడతాయి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మీ శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ప్రోటీన్లు ఉండేట్టు చూసుకోండి. ఇవే మిమ్మల్ని రోజంతా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఎలాంటి పానీయాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో తెలుసుకుందాం పదండి.
బీట్ రూట్, క్యారెట్ జ్యూస్
క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఇనుము అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎన్నో రోగాల నుంచి రక్షించడంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే మంటను తగ్గిస్తాయి. ఇందుకోసం ఈ జ్యూస్ లో పసుపు తో పాటుగా కొద్ది అల్లాన్ని కూడా జోడించండి. ఈ పానీయాలు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.
అవిసె గింజలు, కాలే స్మూతీ
అవిసెగింజలు, పాలు, బాదం పలుకులతో తయారయ్యే ఈ కాలే స్మూతీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ట్రిప్టోఫాన్, ప్రోటీన్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ కాలే స్మూతీకి కావాలనుకుంటే మీకు నచ్చిన పండ్లను కూడా జోడించొచ్చు. ఈ స్మూతీ ఎంతో ఆరోగ్యకరమైంది కూడా. ఎందుకంటే ఆవిసె గింజల ద్వారా మీ శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. అలాగే ఫైబర్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.
గ్రీన్ జ్యూస్
ఆకుకూరల ద్వారా మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అందుతాయి. వీటితో తయారుచేసిన జ్యూస్ ను తాగడం వల్ల మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. ఇందుకోసం సెలెరీ, కాలే, నిమ్మకాయ, దోసకాయ, ఆపిల్, అల్లం కలిపి జ్యూస్ ను తయారుచేయండి. ఒకగ్లాస్ ఈ జ్యూస్ ను తాగడం వల్ల మీ శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వీటికి కావాలనుకుంటే బచ్చలికూర లేదా మీకు నచ్చిన ఆకుపచ్చని కూరగాయలను జోడించొచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
ఉసిరి తేనె రసం
ఇండియన్ గూస్ బెర్రీగా పేరుపొందిన ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి రసం పోషక భాండాగారం అని చెప్పాలి. దీనిలో ఉండే విటమిన్ సి మీ రోజు అవసరాన్ని తీర్చడానికి సరిపోతుంది. ఇది పొట్టను శుభ్రపర్చడంతో పాటుగా రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. దీనిలో యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.