థైరాయిడ్ తో విపరీతంగా బరువు పెరిగిపోయారా..? అయితే ఇలా చేయండి..

Published : Sep 04, 2022, 10:03 AM IST

థైరాయిడ్ వల్ల కొంతమంది బరువు తగ్గితే.. మరికొంత మంది మాత్రం దారుణంగా బరువు పెరిగిపోతుంటారు. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చు.  

PREV
18
థైరాయిడ్ తో విపరీతంగా బరువు పెరిగిపోయారా..? అయితే ఇలా చేయండి..

థైరాయిడ్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. రెండు అంగుళాలుండే ఈ గ్రంథి ఆరోగ్యకరమైన గుండె, జీర్ణ, నాడీ, పునరుత్పత్తి కండరాల పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా చిన్న వయసు వారు సైతం.. థైరాయిడ్ సమస్యను ఫేస్ చేస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల శరీర ప్రక్రియలు నెమ్మదిస్తాయి. అంతేకాదు దీని బారిన పడితే అకస్మత్తుగా.. వేగంగా బరువు పెరుగుతారు. 
 

28

అయితే ఈ బరువు పెరగడం అనేది థైరాయిడ్ వల్లే కాదు.. ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా కావొచ్చు.ఒకవేళ మీరు థైరాయిడ్ సమస్య వల్లే బరువు పెరిగితే మాత్రం బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఒత్తిడి తగ్గించుకుని, ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సులువుగా బరువు తగ్గొచ్చు. అదనపు కిలోలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం పదండి.. 
 

38

అయోడిన్

అయోడిన్ థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది. అయితే అయోడిన్ ను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని కనుగొనబడింది కూడా. అందుకే అయోడైజ్డ్ ఉప్పు, గుడ్లు, చేపలు, వంటి అయోడిన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం చాలా ముఖ్యం. అయితే అయోడిన్ సప్లిమెంట్లను, అయోడిన్ చుక్కలను కూడా తీసుకోవచ్చు. 
 

48
fiber

ఫైబర్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి చాలా అవసర పడుతుంది. ఫైబర్ కంటెంట్ శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ ను కూడా తొలగించేందుకు సహాయడుతుంది. అలాగే కేలరీల వినియోగాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తింటూ ఉండండి. 
 

58


విటమిన్ డి

థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచేందుకు విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. విటమిన్ డి లోపం ఉండే ఆహారాల వల్ల కూడా వేగంగా బరువు పెరుగుతారని తేలింది. అందుకే థైరాయిడ్ సమస్య ఉంటే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోండి. ఇందుకోసం కొవ్వు చేపలు, అవయవ మాంసం, సూర్యరశ్మి, పుట్టగొడుగులు వంటి ఆహారాలను తినండి. అవసరమైతే..  డాక్టర్ సలహా తీసుకుని విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి. అయితే వీటిని మాత్రం మోతాదుకు మించి తీసుకోకూడదు. 
 

68

copper

copper కూడా థైరాయిడ్  బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథులు సక్రమంగా పనిచేసేందుకు రాగి ఎంతో సహాయపడుతుంది. అందుకే మీ రోజు వారి ఆహారంలో రాగి ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇది జీవక్రియను కూడా వేగంగా చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం నువ్వులు, బాదం , చిక్కుళ్లను తినండి. 
 

 

78

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు కూడా సహాయపడతాయి. ఇవి శరీర మంటను కూడా తగ్గిస్తాయి. ఈ కొవ్వులు బరువును నియంత్రించడమే కాదు థైరాయిడ్ గ్రంథిలో మంటను తగ్గించేందుకు సహాయపడతాయి. అవిసె గింజలు, నెయ్యి, చియా విత్తనాలు, వాల్ నట్స్ ను ఎక్కువగా తింటూ ఉండండి. 
 

88
fruits

పండ్లు

పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా సహాయపడతాయి. వీటిలో ఉండే ఎన్నో రకాల పోషకాలు మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. పండ్లు బరువును కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ఇందుకోసం.. ఆపిల్స్, అవొకాడో, బెర్రీలను  తినండి. ఈ పండ్లు ఫ్రీరాడికల్స్ నుంచి థైరాయిడ్ గ్రంథి నష్టాన్నిన నివారించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు థైరాయిడ్ పేషెంట్లు ఎంతో ఉపయోపడతాయి. అలాగే గుండె, మధుమేహం, ఊబకాయం సమస్యలను నివారిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories