ఇవి లేకపోవడం వల్లే మీ జుట్టు ఉడిపోతుంది.. త్వరగా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చెయ్యండి!

Published : Sep 03, 2022, 01:10 PM IST

ప్రస్తుతం అప్ డేట్ అయిన జనరేషన్ కారణంగా ప్రజలు జుట్టు రాలే సమస్యతో అనేక రకాలుగా బాధపడుతున్నారు. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య మరింత పెరిగిపోయింది. మానవుని జీవన విధానంలో పెరిగిపోయిన స్మార్ట్ ఫోన్ల వినియోగం వలన ఈ సమస్య మరింత పెరిగింది.  

PREV
15
ఇవి లేకపోవడం వల్లే మీ జుట్టు ఉడిపోతుంది.. త్వరగా పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చెయ్యండి!

అంతేకాకుండా ప్రస్తుతం 24 గంటలు ప్రజలు స్మార్ట్ వర్క్ కి అలవాటు పడి లాప్టాప్ ముందల కూర్చుంటున్నారు. దీనివల్ల మరింత ఒత్తిడికి దారితీస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టు రాలే సమస్యను మరింత పెంచుతుందని చెప్పవచ్చు. ఇక కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ జుట్టు రాలే సమస్యను అరి కట్టవచ్చని తెలుస్తుంది. ఇప్పుడు మనం అవేమిటో తెలుసుకుందాం.

25

గుడ్డు, తేనె, ఆపిల్ మరియు సైడర్ వెనిగర్: ఒక గిన్నెలో రెండు గుడ్లు కొట్టండి. దానికి సొనలను విస్మరించకూడదు. దానికి ఆపిల్ సైడర్,  వెనిగర్ ను కలపాలి. అంతేకాకుండా ఈ మిశ్రమంలో తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు అప్లై చేసి మీ జుట్టు చివరలకు పూయండి. తలను పూర్తిగా గుడ్డుతో నింపేయండి. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత మీరు షాంపూ తో తలను వాష్ చేసుకోవాలి తద్వారా మీ తలకు అధిక ప్రోటీన్లు అంది జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

35

అవకాడో మరియు మయోన్నైస్: ముందుగా అవకాడోను  సగానికి కోసి బాగా మెత్తగా తయారుచేసి పెట్టుకోవాలి. దీనిలో రెండు టేబుల్ స్పూన్ మయోన్నైస్ కలపాలి ఈ మాస్క్ ను మీ జుట్టుకు మొత్తం అప్లై చేయాలి. ఆ తర్వాత వేళ్ళతో చిన్నగా మసాజ్ చేసుకోవాలి. సుమారు ఒక 30 నిమిషాల పాటు ఇలా ఉంచి ఆ తర్వాత మీరు హెడ్ వాస్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టుకు పోషకాలు అంది జుట్టు మృదువుగా బాగా బలపడుతుంది.

45

మెంతి హెయిర్ మాస్క్: ముందుగా రెండు టేబుల్స్ స్పూన్ ల మెంతి గింజలను  రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మెంతి గింజలను బాగా రుబ్బు కొని బ్రష్ తో తలకు జుట్టుకు పట్టించాలి. ఇక జుట్టును ఒక గుడ్డుతో కప్పేయండి. ఇలా ఒక 45 నిమిషాల పాటు ఉంచి మీ జుట్టును కడిగేయడం ద్వారా మీ జుట్టుకు ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా జుట్టు రాలే సమస్య మీ నుంచి దూరం అవుతుంది.
 

55

ఫ్రూట్, కోకోనట్ మిల్క్ హెయిర్ ప్యాక్: ముందుగా ఒక అరటిపండు అంతేకాకుండా కొన్ని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ తల మొత్తానికి పట్టించాలి. ఇలా ఒక 30 నిమిషాలు గడిచిన తర్వాత మీ జుట్టుని చల్లటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ లో ఫాస్ఫరస్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది పొడిగా మారి దెబ్బతిన్న జుట్టుకు సరైన పోషణ ఉండే విధంగా చూసుకుంటుంది.

click me!

Recommended Stories