Mutton Curry: మటన్ కర్రీ ఇలా చేశారంటే.. టేస్ట్ అదిరిపోతుంది! ఈజీ రెసిపీ

Published : Nov 07, 2026, 04:41 PM IST

Mutton Curry: మటన్ ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. సండే వచ్చిందంటే చాలు మటన్ ఉండాల్సిందే. మరి ఘుమఘుమలాడే మసాలాలతో చిక్కటి గ్రేవీ, మెత్తగా ఉడికిన మటన్ ముక్కలు కలిస్తే ఆ రుచే వేరు. ఇంట్లోనే హోటల్ స్టైల్‌లో మటన్ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం.

PREV
15
స్పైసీ మటన్ కర్రీ రెసిపీ

సండే, పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో చాలా ఇళ్లలో ఉదయాన్నే మటన్ లేదా నాటుకోడి కూర వాసన ఘుమఘుమలాడుతుంది. ఈ ఆదివారం మీ ఇంట్లో మటన్ వండాలనుకుంటే, రొటీన్ రుచికి భిన్నంగా ఇలా కాస్త స్పైసీగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంతో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మటన్ కూరను కుక్కర్‌లోనే చాలా ఈజీగా ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం.

25
కావాల్సిన పదార్థాలు

మటన్ (మేక మాంసం) - ½ కిలో

పెద్ద ఉల్లిపాయలు - 2

టమాటాలు - 2

కారం - ½ టీస్పూన్

పసుపు - ½ టీస్పూన్

మిరియాల పొడి - 1 టీస్పూన్ + ¼ టీస్పూన్

ధనియాల పొడి - 2 టీస్పూన్లు

మటన్ మసాలా పొడి - 1 టీస్పూన్

పల్లి నూనె - 2 టీస్పూన్లు

కరివేపాకు - 3 రెమ్మలు

కొత్తిమీర - గుప్పెడు

ఉప్పు - తగినంత

35
మసాలా కోసం కావాల్సినవి

పల్లి నూనె - 2 టీస్పూన్లు

దాల్చిన చెక్క - 2

లవంగాలు - 6

జీలకర్ర - 1 టీస్పూన్

సోంపు - 1 టీస్పూన్

వెల్లుల్లి - 5- 6 రెబ్బలు

అల్లం - 2 ముక్కలు

చిన్న ఉల్లిపాయలు - సరిపడా

కొబ్బరి - ¼ చిప్ప

కరివేపాకు - 1 రెమ్మ

45
మటన్ కర్రీ తయారీ విధానం

ముందుగా మటన్‌ను గిన్నెలో తీసుకుని 2 సార్లు కడగాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి పొట్టు తీసి సన్నగా తరగాలి. మంచిగా పండిన టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లాన్ని మట్టి లేకుండా కడిగి, పొట్టు తీసి సన్నగా తరగాలి. కొత్తిమీర, కరివేపాకును కడిగి పెట్టుకోవాలి. కొబ్బరిని తురుముకుని రెడీ చేసుకోవాలి.

ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కాక దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, సోంపు, పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, తరిగిన అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. తర్వాత తురిమిన కొబ్బరి వేసి ఒక్క నిమిషం వేయించి, స్టౌ ఆపేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీ జార్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

55
తర్వాత ఏం చేయాలంటే?

స్టౌ మీద కుక్కర్ పెట్టి నూనె వేడి చేయాలి. తరిగిన పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తర్వాత తరిగిన టమాటాలు వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాక కారం, పసుపు, 1 టీస్పూన్ మిరియాల పొడి, ధనియాల పొడి, మటన్ మసాలా వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్, శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి, మీడియం మంట మీద కరెక్ట్‌గా 20 నిమిషాలు ఉడికించాలి.

20 నిమిషాల తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే ఇంకాసేపు ఉడికించవచ్చు. తర్వాత మళ్లీ కుక్కర్‌ను స్టౌ మీద పెట్టి కరివేపాకు, ¼ టీస్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించితే చాలు.. స్పైసీ మటన్ కర్రీ రేడీ అవుతుంది. వేడి వేడి అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories