గ్రీన్ టీ
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బరువును తగ్గించడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఆఫీసులో ఏదైనా కారణం వల్ల మీరు ఒత్తిడికి గురైనట్లు వెంటనే కప్పు గ్రీన్ టీని తాగండి. మీరు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గందర గోళం కూడా పోతంది. మనస్సు చంచలత పోతుంది. రోజుకు మూడు సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.