ఇలాంటి వారికి 30 నిమిషాల వ్యాయామం అస్సలు సరిపోదు

First Published Sep 18, 2022, 1:00 PM IST

రోజంతా కూర్చునే వారు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందలేరని నిపుణులు చెబుతున్నారు. అంటే వీళ్లు వ్యాయామం చేసినా.. రోగాల బారిన పడొచ్చన్న మాట. 
 

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోం చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనివల్ల కరోనా బారిన పడకుండా ఉండగలిగారు కానీ.. ఎన్నో అనారోగ్య సమస్యలను మాత్రం మూటగట్టుకున్నారనే చెప్పాలి. ఎందుకంటారా.. ఇంట్లోంచి పనిచేయడం వల్ల టైం కి లేవడం ఫ్రెష్ అవడం తినడం.. కూర్చోవడం తప్ప మరేం చేయడం లేదు. అదే ఆఫీసుల్లో ఉంటే ఎప్పుడో ఒకసారైనా కాఫీ అనో, టీ అని అలా బయటకు నడిచేవారు. కానీ ఈ వర్క్ ఫ్రం హోం వల్ల అది కూడా లేకుండా పోయింది. పొద్దంతా ల్యాప్ టాప్ ల ముందు కోర్చోవడం తినడం తప్ప నడక అనేది లేకుండా పోయింది. కానీ మేం పొద్దున 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నాం కదా అనేవారు లేకపోలేదు. కానీ పొద్దంగా కూర్చుని జస్ట్ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఎలాంటి ఫలితాలుండవు అంటున్నారు నిపుణులు. 

రోజంతా కుర్చుని ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేసే వ్యక్తుల కోసం ‘యాక్టీవ్ కౌచ్ పొటాటో’ అనే పేరుతో ఒక అధ్యయనం నిర్వహించారు. "స్పోర్ట్స్ & ఎక్సర్ సైజ్ లో మెడిసిన్ & సైన్స్" లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో.. ఫిన్లాండ్ లోని 3,700 మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఒక వారం రోజుల పాటు వారి కదలికలను అంచనా వేయడానికి శాస్త్రీయ-గ్రేడ్ యాక్టివిటీ ట్రాకర్లను ధరించమని చెప్పారు.

రెగ్యులర్ గా 30 నిమిషాల పాటు ఎక్సర్ సైజెస్ చేసి.. ఆ తర్వాత రోజులో 10 నుంచి 12 గంటల మధ్య కూర్చునే వారిలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్, శరీర కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. పని మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడిచేవారితో పోల్చితే  వీరికే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 


రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోదు.. 

ఎక్కువ సేపు కూర్చునే వారు కేవలం 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోదని ఓలూ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టొరల్ శాస్త్రవేత్త , ఈ అధ్యయనానికి అధ్యక్షత వహించిన వహీద్ ఫరాహి అన్నారు.  గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి జస్ట్ కొన్ని నిమిషాలే వ్యాయామం చేస్తే సరిపోదని ఈయన అన్నారు. ఎప్పుడూ కూర్చునే వారితో పోల్చితే.. పని మధ్యలో లేచి కొద్దిసేపైనా నడిచే 40 శాతం మంది చురుగ్గా ఉన్నారని అధ్యయనం తేల్చి చెప్పింది.
 

దీనిలో పాల్గొన్న కొంతమంది మాత్రం క్రమం తప్పకుండా వన్ హవర్ ఎక్సర్ సైజ్ చేయడంతో పాటుగా మరో రెండు గంటలు ఇతర శారీరక శ్రమ పనులను చేస్తున్నారట. అయితే గంటలకు గంటలు కూర్చోవడం వల్ల రక్తంలో కొవ్వు విపరీతంగా పెరిపోవడంతో పాటుగా, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బాగా పెరిగిపోయాయని పరిశోధకులు చెబుతున్నారు. 

ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి

రోజూ వ్యాయామం చేయడంతో పాటుగా పని మధ్యలో కాసేపు నడవండి. ఇంటిని శుభ్రం చేయడం, బాడీ కదిలేటట్టు నడవడం, మెట్లు ఎక్కడం,దిగడం వంటివి చేయండి. రోజుకు 80 నుంచి 90 నిమిషాలు వివిధ పనులను చేయండి. అంటే బాడీ కదిలేట్టు ఉండే తేలికపాటి పనులన్న మాట. శరీరం ఎక్కువగా కదిలితేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారన్న సంగతిని మార్చిపోకండి.  

click me!