Health Tips: వానాకాలమని స్నానం చేయకుండా ఉంటే.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా..?

Published : Aug 01, 2022, 11:47 AM IST

Health Tips: రోజూ జోరుగా వానలొస్తున్నాయ్.. వెదర్ కూడా కూల్ గా ఉంది.. రోజూ ఏం స్నానం చేస్తాం.. రోజు తప్పించి రోజో.. లేకపోతే రెండు రోజులకోసారో స్నానం చేద్దాం..లే అనుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ కాలంలో రోజూ స్నానం చేయకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

PREV
17
Health Tips: వానాకాలమని స్నానం చేయకుండా ఉంటే.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా..?

వానాకాలం, చలికాలంలో స్నానం చేయడానికి కొంతమందికి  అస్సలు ఇష్టముండదు. ఎందుకంటే ఈ సీజన్లలో వెదర్ చాలా కూల్ గా ఉంటుంది. ఇంత చలిలో స్నానం చేస్తే.. వామ్మో.. జలుబు, జ్వరం లాంటి రోగాలొచ్చేస్తాయ్ అని కొందరు, బద్దకంగా ఉండి మరికొందరు రెగ్యులర్ గా స్నానం చేయరు. రెండు, మూడు రోజులకోసారి చేస్తుంటారు. 
 

27

అందులోనూ ఈ సీజన్ లో పెద్దగా చెమట కూడా పెద్దగా పట్టదని .. స్నానం చేయపోయినా ఏం కాదని భావిస్తుంటారు. కానీ కాలాలతో సంబంధం లేకుండా స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేయకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తదని హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
 

37

చెడు వాసన

రెగ్యులర్ స్నానం చేయకపోతే.. శరీరంపై మురికితో పాటుగా బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది. దీనివల్ల ఒంటి నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉంది. 

47

ఇన్ఫెక్షన్స్

వానలు పడుతున్నాయని స్నానం చేయకపోతే శరరంపై మృతకణాలు పేరుకు పోయి బ్యాక్టీరియల్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇవి శరీరమంతా వ్యాపించి చర్మ రోగాలకు దారితీస్తాయి. 

57

జుట్టు రాలుతుంది

కాలాలన్నింటితో పోల్చితే వానాకాలంలోనే జుట్టు ఎక్కువగా రాలుతుంది. చుండ్రు కూడా విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ లో ఎక్కువగా వానలో తడవడం తర్వాత తలస్నానం చేయకుండా  జుట్టును ఆరబెట్టడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. నెత్తిపై దురద కూడా పెడుతుంది. ముఖ్యంగా జుట్టుపై దుమ్ము, దూళి పేరుకుపోతుంది. 
 

67

రోగ నిరోధక శక్తిపై ప్రభావం  

చలిపెడుతుందని రోజుల తరబడి స్నానం చేయకుంటే శరీరంపై బ్యాక్టీరియా, వైరస్ లు చేరుతాయి. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు, ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది. 
 

77

చర్మ సమస్యలు

వానలు పడుతున్నాయని స్నానం చేయకపోవడం వల్ల ఎన్నో రకాల చర్మ రోగాలతో పాటుగా సీజనల్ రోగాలు కూడా వస్తాయి. అందుకే వానాకాలమైనా.. చలికాలమైనా గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. స్నానమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories