ఏం చేసినా.. మొటిమలు, నల్లని మచ్చలు పోవడం లేదా? అయితే రోజ్ వాటర్ ని ఇలా యూజ్ చేయండి..?

Published : Aug 01, 2022, 09:39 AM IST

రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి ముఖంపై ఉంచే మొటిమలను, నల్లని మచ్చలను, గాయాలను నయం చేయడంలో ఎంతో సహాయపడతాయి. 

PREV
17
  ఏం చేసినా.. మొటిమలు, నల్లని మచ్చలు పోవడం లేదా? అయితే రోజ్ వాటర్ ని ఇలా యూజ్ చేయండి..?

సౌందర్య సాధనాలలో ఒకటైన రోజ్ వాటర్ ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా ఇది చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటుగా వృద్ధాప్యంతో వచ్చే ముడతలను సైతం తొలగించడానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్ చర్మంపై ఉత్పత్తి అయ్యే అదనపు నూనెను కూడా నియంత్రిస్తుంది.
 

27

రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలను, తామరను వదిలించుకోవడానికి సహాయపడతాయి. ఇది అద్భుతమైన క్లీన్సర్ గా కూడా పనిచేస్తుంది. 
 

37

అలాగే మూసుకుపోయిన రంధ్రాలలో పేరుకుపోయిన నూనెను, దుమ్ము, ధూళిని తొలగించడంలో సహాయపడుతుందని చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు.
 

47

దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయలను, ముఖంపై ఉండే నల్లని మచ్చలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మ కణాలను బలోపేతం చేయడంతో పాటుగా.. చర్మ కణాలను పునరుజ్జీవింపజేయడానికి సహాయపడతాయి.
 

57

మొటిమలను పూర్తిగా తగ్గించడానికి, ముఖంపై నల్లటి మచ్చలను తొలగించేందుకు.. రోజ్ వాటర్ లో ముంచిన దూదితో మీ ముఖాన్ని తుడుచుకోవాలి. రోజ్ వాటర్ కు కొద్దిగా నిమ్మరసం జోడించి ముఖానికి అప్లై చేసినా మొటిమలు చాలా తొందరగా తొలగిపోతాయి. 

67

చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన చెమటను, మురికిని తొలగించడానికి కూడా రోజ్ వాటర్ ను ఉపయోగించొచ్చు. అయితే రాత్రిపూట మాత్రమే దీన్ని ఉపయోగించాలి. అది కూడా ముఖాన్ని నీట్ గా కడిగిన తర్వాతే ఉపయోగించాలి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. 

77

కళ్ల చుట్టూ ఉన్న నలుపుదనాన్ని తొలగించడంలో కూడా రోజ్ వాటర్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రోజ్ వాటర్ ను ఫ్రిజ్ లో కొద్ది సేపు ఉంచి బ్లాక్ సర్కిల్స్ కు అప్లై చేయాలి. తరువాత రోజ్ వాటర్ అద్దిన దూదిని కంటి పైన కాసేపు ఉంచాలి.  దీనివల్ల కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను తొందరగా వదిలిపోతాయి. అంతేకాదు మేకప్ ను కూడా ఇది సులువుగా వదిలిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories