అవకాడో, వాల్ నట్స్
చర్మ సంరక్షణకు విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కె లు బాగా అవసరమవుతాయి. ఇవి చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకుంటే కూడా ఎలాంటి చర్మ సమస్యలు రావు. ఇందుకోసం ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మాన్, నెయ్యి, వాల్ నట్స్, అవిసె గింజలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి.