డెనిమ్ లుక్ నచ్చేవారికి చాంబ్రే కూడా ఉపయోగకరమైన ఆప్షన్. ఇది చూడటానికి డెనిమ్‌లా కనిపించినప్పటికీ దానికంటే చాలా తేలికగా, గాలి ఆడేలా ఉంటుంది. చాంబ్రే షర్ట్స్, డ్రెస్‌లు క్యాజువల్ లుక్‌కు బాగా సరిపోతాయి. ముఖ్యంగా వర్షంలో తడిసినప్పుడు సాధారణ డెనిమ్‌లా బరువుగా మారే సమస్య ఇందులో తక్కువగా ఉంటుంది.
ఎథ్నిక్ వేర్ ఇష్టపడేవారికి కాటన్-రేయాన్ బ్లెండ్ దుస్తులు మంచి ఎంపిక. రేయాన్ వల్ల దుస్తులకు మంచి ఫ్లో, డ్రేప్ వస్తే.. కాటన్ వల్ల గాలి ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. లైట్ వెయిట్ కుర్తీలు, పాలాజోలు, చీరలు వంటి వాటిని ఈ సీజన్‌లో ధరించవచ్చు.ఇవి ఇతర హెవీ ఫ్యాబ్రిక్స్‌తో పోలిస్తే అంత బరువుగా అనిపించవు.