ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తినాలని అందరికీ ఉంటుంది. కానీ, వాటిని చేయడానికి పూనుకున్నప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. పిండి కలపగానే విరిగిపోవడం, పెనం మీద వేయగానే పగిలి ముక్కలు కావడం, తీరా కాలిన తర్వాత పకోడీలా గట్టిగా మారడం... ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతుంటాయి. గోధుమ పిండిలో ఉన్నట్లు జొన్న, రాగి పిండుల్లో 'గ్లూటెన్' (జిగురు ) ఉండకపోవడమే దీనికి కారణం.
అయితే, ఒక చిన్న నాచురల్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌తో పాటు కొన్ని పల్లెటూరి చిట్కాలను పాటిస్తే... ఎలాంటి క్రాక్స్ లేకుండా, హోటల్ లేదా పల్లెటూరి స్టైల్‌లో దూదిలా మెత్తగా, పొంగే జొన్న, రాగి రొట్టెలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు!