Monsoon Diet:వర్షాకాలంలో మాంసాహారాన్ని తినడం సేఫ్ కాదు.. ఎందుకంటే

First Published Jul 1, 2022, 2:30 PM IST

Monsoon Diet: వర్షాకాలంలో మాంసాహారాలను తినడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..? 
 

వర్షాకాలం రాకతో.. వాగులు వంకలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ సీజన్ లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. అంతేకాదు ఈ సీజన్ లోనే రోగాలు కూడా ఎక్కువగా సోకే ప్రమాదముంది. వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, మలేరియా వంటి ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదముంది. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ సీజన్ లో ఆకు కూరలతో పాటుగా నాన్ వెజ్ ఫుడ్ కు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వర్షాలు పడిన వెంటనే ఎన్నో వ్యాధులు,  అంటువ్యాధుల ప్రమాదులు సోకే ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యాదులు మాంసాహారం ద్వారా కూడా సోకే అవకాశం ఉంది. ఈ సీజన్ లో మాంసాహారాన్ని ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

వర్షాకాలంలో నాన్ వెజ్ ఫుడ్ ఎందుకు ప్రమాదకరం?

మతపరంగా చూస్తే.. శ్రావణ మాసంలో ఆ పరమేశ్వరుడిని భక్తీ శ్రద్దలతో కొలుస్తారు. పరమేశ్వరుడిని పూజించేవాళ్లేవరూ మాంసాహారం జోలికి వెళ్లరు. ఇక శాస్త్రీయంగా కూడా ఈ సమయంలో మాంసాహానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫంగస్ ప్రమాదం

ఈ సీజన్ కురిసే వర్షాల వల్ల గాలిలో తేమ ఎక్కువ అవుతుంది. దీంతో శిలింధ్రాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు ఈ సీజనలో ప్రత్యక్ష స్యూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఆహార పదార్థాలు చాలా త్వరగా కుల్లిపోతాయి. 
 


బలహీనమైన జీర్ణక్రియ

ఈ రెయినీ సీజన్ లో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మనం వర్షాకాలంలో మాంసాహారం తింటే అది త్వరగా అరగదు. దాంతో అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్ లో నాన్ వెజ్ ను తినకపోవడమే ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక వేళ తింటే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉంది. 
 

పశువులు అనారోగ్యం బారిన పడతాయి

వర్షాకాలంలో కీటకాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో దోమల వల్ల డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులు పెరిగిపోతాయి. ఇవి జంతువులను తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తుంది. అందుకే ఈ వానాకాలంలో నాన్ వెజ్ ను తినకుండా ఉండటమే బెటర్. 

చేపలు కలుషితమవుతాయి

చేపలు మన ఆరోగ్యానికి మంచివే అయినా.. ఈ సీజన్ లో వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వర్షాల కారణంగా ఎక్కడెక్కడో ఉన్న మురికి అంతా చెరువుల్లోకి వెళ్లడంతో చేపలు కలుషితం అవుతాయి. ఈ సీజన్ మీరు చేపలను తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం..
 

click me!