మానసిక ఆరోగ్యంగా బాగుండాలంటే ఇవి ఖచ్చితంగా తినండి..

Published : Nov 03, 2022, 01:58 PM IST

మనం బాగుండాలంటే శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. మనం తినే ఫుడ్, నిద్ర వంటివి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.   

PREV
17
మానసిక ఆరోగ్యంగా బాగుండాలంటే ఇవి ఖచ్చితంగా తినండి..

గజిబిజీ లైఫ్ కారణంగా మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశారు. కానీ మన మానసిక ఆరోగ్యం బాగుంటేనే శారీరక ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి.. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. అందుకే మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇందుకోసం కొన్ని రకాల ఆహారాలను తప్పకుండా తినాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

27

భోజనాన్ని స్కిప్ చేయొద్దు

ఆరోగ్యంగా ఉండేందుకు భోజనాన్ని స్కిప్ చేయొద్దు. టైం కి తింటేనే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.  జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. భోజనం తినకపోతే బద్దకంగా, చికాకుగా అనిపిస్తుంది. ఫుడ్ ను సరిగ్గా తినకపోతే.. ఒంట్లో శక్తి  స్థాయిలు తగ్గుతాయి. హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల మీ మానసిక పరిస్థితి దిగజారుతుంది. అందుకే టైం కి  భోజనం చేయండి. 
 

37

హైడ్రేట్ గా ఉండండి

రోజుకు 7 నుంచి 9 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. నీటితోనే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. లేదంటే బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మీకు మరింత చిరాకు కలుగుతుంది. అలాగే తలనొప్పి వస్తుంది. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ సుమారు 2 లీటర్ల నీటిని తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. 
 

47
protein rich foods

తగినంత ప్రోటీన్ ఫుడ్ ను తినాలి

మీరు తినే ప్రతి భోజనంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా అమైనో ఆమ్లాలు. ఇవి మీ మానసిక స్థితి నియంత్రణకు సహాయపడతాయి. మీ శరీరంలో ప్రోటీన్ల కొరత రాకూడదంటే మీరు తినే బ్రేక్ ఫాస్ట్ లో పాలు, గుడ్లను తినండి. దీంతో పాటుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసాహారం, ఇతర ఆహారాలను మీ భోజనంలో చేర్చుకోండి. 
 

57

గట్ ఆరోగ్యం గురించి శ్రద్ధ

మీ కడుపు ఆరోగ్యంగా ఉంటేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఒత్తిడికి గురైతే.. మీ గట్ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే గట్ ను ఆరోగ్యంగా ఉంచే పండ్లు, చిక్కుళ్లు, కూరగాయాలు, ప్రోబయోటిక్స్ ను ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ జర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

67

కెఫిన్ దూరంగా

కెఫిన్ కంటెంట్ మన ఆరోగ్యానికి చేసే మేలు కంటే హాని యే ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ముఖ్యంగా కెఫిన్ ఉండే పానీయాలను రాత్రి పూట తాగడం వల్ల రాత్రి అస్సలు నిద్ర రాదు. కాబట్టి టీ, కాఫీల వాడకాన్ని తగ్గించండి. 
 

77

వీటిని తినండి

మానసిక స్థితి మెరుగ్గా ఉండేందుకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోండి. ఇవి మీ శరీరాన్ని, మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు  అవసరమైన ప్రోటీన్లను, ఖనిజాలను అందిస్తాయి. అయితే ఆహారాన్ని వండటం వల్ల వాటిలోని పోషక విలువలు తగ్గిపోతాయి. వీటిని పచ్చిగానే తినడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories