రోజులో ఎక్కువ సేపు నిద్రకే సమయం కేటాయిస్తున్నారా... ఇది తెలుసుకోవాల్సిందే?

First Published Nov 3, 2022, 1:19 PM IST

ప్రతి వ్యక్తి జీవితంలో రోజువారి కార్యక్రమాలతో పాటు నిద్ర కూడా ఎంతో ముఖ్యమైనది. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతో పాటు పరుగులు పెట్టడం కోసం నిద్రాహారాలు మాని శ్రమ పడుతున్నారు.
 

సాధారణంగా రోజుల్లో 8 గంటల పాటు నిద్రపోతే ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పాలి. 8 గంటల పాటు నిద్రపోవటం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు. ఇలా రోజులో ఎక్కువసేపు నిద్రకే సమయం కేటాయించేవారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 గంటలు కాకుండా ఎక్కువగా నిద్రపోయే వారిలో ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయానికి వస్తే...
 

రోజుకు ఎనిమిది గంటలకన్నా అధిక సమయం నిద్రపోయే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అధ్యయనాలు ద్వారా నిరూపించారు.అతిగా నిద్రపోవటం వల్ల శరీర బరువు పెరగడమే కాకుండా కొవ్వు పేరుకుపోయి గుండె సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది.వీటితో పాటు తలనొప్పి వెన్నునొప్పి గుండెపోటు వంటి సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో తీవ్రస్థాయిలో డిప్రెషన్ ఏర్పడడం తలనొప్పి, గుండె చప్పుడు అసాధారణ రీతిలో ఉండడం అలాగే మానసిక సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇక ఎక్కువసేపు నిద్రపోయే వారిలో ఆయుష్షు కూడా తగ్గుతుంది.
 

ఇలా ఎక్కువ సమయం పాటు నిద్రపోకుండా ఎనిమిది గంటలు మాత్రమే నిద్రకు కేటాయిస్తూ ప్రతిరోజు ఉదయం లేవగానే యోగా వ్యాయామాలు వంటివి చేయడం ఎంతో ఉత్తమం. పగలు వీలైనంత వరకు నిద్రపోకుండా పగటి నిద్రను అవాయిడ్ చేయాలి. అదేవిధంగా రోజంతా ఎక్కువగా శారీరక శ్రమ చేయటం వల్ల రాత్రి తొందరగా నిద్ర పడుతుంది.అదేవిధంగా నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపించే డ్రగ్స్ ఆల్కహాల్ ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండడం ఎంతో మంచిది.

click me!