ఈ రోగాలు ఆడవాళ్ల కంటే మగవాళ్లకే ఎక్కువ డేంజర్.. వీటిని లైట్ తీసుకోకండి..

First Published Nov 27, 2022, 9:44 AM IST

శరీర తత్వాలను బట్టి రోగాలు ప్రమాదకరంగా మారతాయంటున్నారు నిపుణులు. ఆడవారికి, మగవారికి ఒకే రకమైన వ్యాధులు వచ్చినా..  మగవాళ్లకే ఇవి ఎక్కువ ప్రమాదకరంగా మారతాయంటున్నారు.
 

ప్రస్తుత కాలంలో ప్రమాదకరమైన రోగాలు సైతం సర్వ సాధారణ వ్యాధులుగా మారిపోయాయి. అయితే కొన్ని రకాల రోగాలు పురుషులను, మహిళలను భిన్నంగా ప్రభావితం చేస్తాయంటున్నారు. అందుకే ఆడవారు, మగవాళ్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రాణాలు పోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల రోగాలు ఆడవాళ్ల కంటే పురుషులనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

depression man

డిప్రెషన్

సాధారణంగా మగవాళ్ల కంటే ఆడవారే మానసికంగా వీక్ గా ఉంటారని అంటుంటారు. కానీ మగవాళ్లే మానసికంగా బలహీనంగా ఎక్కువగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆడవారు తమ సమస్యలను చెప్పుకుంటారు. కానీ మగవాళ్లు తమలోనే దాచేసుకుంటారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే ఎలాంటి విషయాన్నైనా మీలోనే దాచుకోకుండా స్నేహితులకో.. కుటుంబ సభ్యులకో చెప్పండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

గుండె జబ్బులు

నిజానికి గుండె జబ్బులు ఆడవారికంటే మగవాళ్లకే ఎక్కువగా వస్తాయి. ఈ ముచ్చట అందరికీ తెలుసు. మగవాళ్లకే ఈ గుండెజబ్బులు ఎక్కువగా రావడానికి ఓ కారణం ఉంది. ఆడవాళ్లతో పోల్చితే పురుషుల శరీరంలోనే కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ వల్లే గుండె  ప్రమాదంలో పడుతుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. 
 

డయాబెటీస్

ఆడవాళ్లతో పోల్చితే.. మగవాళ్లే ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తింటారు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇదికాస్త మధుమేహానికి దారితీస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన  ఆహారాలనే తినండి. మీ రక్తంలో చక్కెర స్థాయిలు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. 
 

కాలెయ వ్యాధి

ఈ కాలెయ వ్యాధి కూడా ఎక్కువగా మగవాళ్లకే వస్తుంది. కారణం స్త్రీల కంటే పేరుషులే మద్యాన్ని ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల కాలెయ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఈ అవయవానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఊపిరితిత్తుల వ్యాధి

మహిళల కంటే పురుషులే ఎక్కువగా స్మోకింగ్ చేస్తుంటారనేది అందరికీ ఎరుకే. అయితే ఇంటి నుంచి బయటకు రావడం వల్ల పురుషులు ఎక్కువగా దుమ్ము, కాలుష్యానికి ఎక్కువగా గురవుతుంటారు. ఈ కారణాల వల్ల పురుషులకు ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తాయి. 

click me!