అపోహ: ఛాతిలో నొప్పి మాత్రమే గుండెపోటుకు సంకేతం
నిజం: ఛాతిలో నొప్పి కేవలం గుండెపోటు వల్లే రాదు. దీనికి ఇంకెన్నో కారణాలు కూడా ఉన్నాయి. కానీ గుండెపోటు లక్షణాల్లో ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, గుండెల్లో మంట, పొత్తికడుపు పై నొప్పి, వాంతులు, వికారం, దవడ నొప్పి, వెన్ను నొప్పి, అలసట, మైకము, విపరీతమైన చెమట పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి మామూలే అని లైట్ తీసుకోకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఏ మాత్రం లేట్ చేసినా మీ ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు.