పల్లీలు అంటే ఇష్టమా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

First Published Nov 26, 2022, 4:57 PM IST

నిజానికి వేరు శెనగలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్భోహైడ్రేట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి. 
 

డయాబెటీస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి ప్రాణాంతక రోగాలు ప్రస్తుతం మన దేశంలోసర్వ సాధారణ వ్యాధులుగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్ ను, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్లే చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారట. నిశ్చల జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం వల్ల ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 

బేకరీ స్నాక్స్ కు బదులుగా వేరుశెనగ వంటి పోషకమైన స్నాక్స్ తినడం వల్ల ఊబకాయం చాలా వరకు తగ్గుతుంది. వేరు శెనగల్లో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, పీచుపదార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు, ఊబకాయులకు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

డయాబెటిస్ ఉన్నవారికి గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి తగ్గాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. పల్లీలు  రక్తపోటును తగ్గిస్తాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి కాదు. ఇవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. అలాగే ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో..
 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేరుశెనగలు చాలా ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. వేరుశెనగలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉంటుంది. షుగర్ పేషెంట్లు తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ ఉన్న ఆహారాల్నే తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

peanuts

వేరుశెనగలు కూడా  రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వేరు శెనగలను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాదు గుండె జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది కూడా. వేరుశెనగను మీ రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

వేరు వెనగల్లో సంతృప్త కొవ్వులతో పాటుగా గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన విటమిన్ ఇ, ఫోలేట్, కాల్షియం, మాంగనీస్ లు కూడా సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే వేరుశెనగలు కనీసం వారానికి ఒక్కసారైనా తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

click me!