Oil Massage: రాత్రి ఈ నూనెను ముఖానికి మసాజ్ చేయండి చాలు, ఉదయానికల్లా మెరుపు వచ్చేస్తుంది

Published : Nov 18, 2025, 09:29 AM IST

Oil Massage: శీతాకాలంలో పొడి చర్మం ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది. అలాంటివారు బాదం నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనె చర్మానికి రాయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ముఖంపై పడిన మచ్చలు, నల్లటి వలయాలు వంటివి తొలగిపోతాయి. 

PREV
15
మెరిసే చర్మం కోసం

శీతాకాలం మొదలైందంటే చల్లని గాలులు, పొడి వాతావరణం చర్మాన్ని ఇబ్బంది పెట్టేస్తాయి. ఇవి చర్మంలోని తేమను కోల్పోయేలా చేస్తాయి. దీనివల్ల ముఖం పొడిగా మారి పగుళ్లు ఏర్పడుతుంది. దురద అనిపిస్తుంది. మచ్చలు కూడా వస్తాయి. రకరకాల మాయిశ్చరైజర్లు, క్రీములు రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. చక్కగా బాదం నూనెను ముఖానికి పట్టించి రాత్రి నిద్రపోతే చాలు.. ఉదయం కల్లా మెరిసే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. ఈ నూనె చర్మాన్ని తేమవంతం చేయడమే కాదు లోపల నుండి మెరిసేలా చేస్తుంది.

25
బాదం నూనెలో ఉండే పోషకాలు

శీతాకాలంలో బాదం నూనె చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో మన చర్మానికి అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. బాదం నూనె తేలికగా ఉంటుంది. జిడ్డును వదిలించేస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ డి, ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అందులో ఉండే జింక్ కూడా చర్మానికి లోతైన పోషణను అందిస్తుంది. ఇంకెన్నో ప్రయోజనాలను బాదం నూనె ఇస్తుంది.

35
మెరుపును అందిస్తుంది

శీతాకాలంలో చర్మాన్ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో పొడి చర్మం కూడా ఒకటి. బాదం నూనె రాయడం వల్ల పొడిబారిన చర్మం హైడ్రేట్ అవుతుంది. రోజంతా మృదువుగా ఉంటుంది. అలాగే మెరుపు కూడా వస్తుంది. దీన్ని ప్రతి రోజు రాయడం వల్ల చర్మం పోషకాలతో నిండి మెరుస్తుంది. చర్మం బయట నుంచే కాదు లోపల నుండి ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.

45
విటమిన్ ఇ వల్ల

బాదం నూనెలో విటమిన్ ఈ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై పడిన గీతలు, ముడతలు, నల్లటి మచ్చలను తొలగిస్తాయి. ప్రతిరోజు మసాజ్ చేయడం వల్ల చర్మం దృఢంగా మీరు యవ్వనంగా మారుతుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా పోతాయి. రక్తప్రసరణ మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నవారు ఒకటి రెండు చుక్కలు అక్కడ వేస్తే సరిపోతుంది.

55
ఇలా నూనె రాసుకోండి

సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా బాదంలోనే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తేలికగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి చికాకును కలిగించదు. ముందుగా ముఖాన్ని పరిశుభ్రంగా కడుక్కొని పొడి టవల్ తో తుడుచుకోండి. కొన్ని చుక్కల బాదం నూనెను ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేసుకోండి. రాత్రిపూట అలాగే నిద్రపోండి. ఉదయం ముఖం శుభ్రం చేసుకుంటే మీకు ఎంతో తేడా కనిపిస్తుంది. వారం రోజులు చేశారంటే ముఖంపై మెరుపు కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories