Drinking Water: వాయమ్మో.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని రోగాలొస్తాయా?

Published : Feb 20, 2022, 01:57 PM IST

Drinking Water: నీళ్లను ఎలా తాగుతున్నారు? అంటే నిలబడి తాగుతున్నారా? లేదా కూర్చొని తాగుతున్నారా ? నీళ్లు తాగడానికి కొన్ని పద్దతులున్నాయి. అందులో నిలబడి నీళ్లు తాగితే మీ పని అంతే ఇక..

PREV
17
Drinking Water: వాయమ్మో.. నిలబడి నీళ్లు తాగితే ఇన్ని రోగాలొస్తాయా?

Drinking Water:నీళ్లతో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. శరీరానికి కావాల్సిన నీళ్లను తాగినప్పుడే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అందులోనూ మార్నింగ్ లేచిన వెంటనే గ్లాస్ నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ కు గురికావడం, స్కిన్ పేలిపోవడం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మనం నీళ్లను తాగినా.. సరిగ్గా తాగకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా తాగడమంటే ఏంటనే ప్రశ్నించొచ్చు. అయితే నీళ్లు కూర్చొని తాగుతున్నారా? లేక నిలబడి తాగుతున్నారా అని.. నిల్చొని నీల్లు తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.   

27

మన శరీరానికి రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. అందుకే ఇంట్లో ఉన్నా అటూ ఇటూ తిరుగుతూ నీళ్లను ఖచ్చితంగా తాగుతూ ఉంటాం.  ఇంట్లో ఉంటే ఇలా చేస్తాం. అదే బయటకు వెళ్లినప్పుడు.. ఏముంది ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతుంటాం. నీళ్లను తాగడం ద్వారానే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే వీటివల్లే మన శరీరంలో ఉండే ఎన్నో మలిన పదార్థాలు బయటకు పోతాయి. అయితే నీళ్లను తాగడానికి కొన్ని పద్దతులున్నాయి. అందులో నిలబడి నీళ్లను అస్సలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. 
 

37

ఎందుకంటే నిలబడి నీళ్లను తాగడం వల్ల సర్వరోగాలు మీ వెంటపడినట్టేనట. ఇంతకీ నిలబడి నీళ్లు తాగితే వచ్చే సమస్యలేంటి అనే కదా మీ ప్రశ్నం.. నిల్చొని నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇలా తాగడం వల్ల వాటర్ నేరుగా ఆహార గొట్టంలోంచి జీర్ణాశయంలోకి ( Gastrointestinal tract)పోతాయి. దీనివల్ల  అసిడిటి, అజీర్థి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందట. 

47

అంతేకాదు నిలబడి నీళ్లను తాగడం వల్ల Kidney లకు నీళ్లు అందవట. దీనివల్ల కిడ్నీల్లో రాళ్లు, Bladder ప్రాబ్లమ్స్ తో పాటుగా ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా  తలెత్తుతాయట. 

57

నిల్చొని నీళ్లు తాగితే మూత్రపిండాలను ఆ నీళ్లను ఫిల్టర్ సరిగ్గా చేయలేవట. ఈ కారణంగా మన శరీరంలో ఉండే వ్యార్థాలన్నీ స్ట్రెయిట్ గా Kidney ల్లోకి వెళతాయి. అంతేకాదు అవి రక్తంలో కలిసిపోతాయి. అంతేకాదు నీళ్లను ఇలా తాగితే Nervous system దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దీనివల్ల Fluid సమత్యులంగా ఉండవు. దాంతో కీళ్లలో ద్రవాలు పెద్ద మొత్తంలో చేరతాయి. దీంతో కీళ్లవాతం, ఆర్థరైటీస్ వంటి జబ్బుల పాలవుతారు. 

67

నీళ్లను ఎలా తాగాలి:  చాలా మందికి ప్రాపర్ గా నీళ్లను ఎలా తాగాలో తెలియదు. నీళ్లను బాటిల్ లేదా గ్లాసుతో తీసుకుని ఒక దగ్గర కూర్చొవాలి. దాని తర్వాత నీళ్లను కొద్ది కొద్దిగా చాలా స్లోగా తాగాలి. ఎలా అంటే వేడి వేడిగా ఉంటే కాఫీ లేదా టీని ఎలా తాగుతామో అలా అన్నమాట. ఇలా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తెలుసా.. అజీర్థి, అసిడిటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు. 
 

77

ఈ సమస్యలు మీకు ఇదివరకే ఉన్నా.. ఇప్పటి నుంచి నీళ్లను ఇలా తాగండి. నెల రోజుల్లోనే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.  అన్నం తినే గంటముందు, తిన్న గంట తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం.. నీళ్లను తాగేటప్పుడు పై నుంచి నోట్లో పోసేయకూడదు.  దేంతో నీళ్లను తాగినా దాన్ని మూతికి కరిచిపెట్టుకునే తాగడం మంచిది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories