భర్త ఇలా చేస్తే భార్యను హింసిస్తున్ననట్టే..

First Published | Feb 20, 2022, 11:37 AM IST

భర్యా భర్తలైనా, స్నేహితుల బంధమైనా.. ఎవరో ఒకరు మరొకరిని వారి కంట్రోల్లోకి తెచ్చుకోవాలని భావిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తుంటారు. ఆ హింస ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రిలేషన్ షిప్ లో బయటివారు గుర్తించలేని, కంటికి కనబడని హింస జరుగుతూ ఉంటుంది. ఈ బాధ పడేవారికే కూడా కొన్ని కొన్నిసమయాల్లో  గుర్తించలేరు. కానీ మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపూరితంగా జరిగే ఈ హింస మనిషికి అన్ని విధాలుగా క్రుంగదీస్తుంది. ఎక్కువ రోజులు అలాగే కొనసాగితే మాత్రం బాధను అనుభవిస్తున్న వ్యక్తి  మానసికంగా బలహీనుడిగా మారిపోవడం పక్కాగా జరుగుతుంది.

మరొకరి జీవితాన్ని శాసించే అధికారం ఎవ్వరికీ లేదు. ఆఖరికి భర్తకు కూడా. కానీ కొంతమంది ఆడవారు వారి భర్త చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఇష్టపూర్వకంగా కాదు.. బలవంతంగా. అవును ఇలాంటి వారు స్వతంత్ర్యంగా బతకలేరు. వారు ఎలా ఉండమంటే అలాగే నడుచుకోవాలి. వారికి నిర్ణయాలు తీసుకునే అధికారమే ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే వీరు బానిసలుగా (Slaves) బతుకుతున్నారనొచ్చు. అయితే మీ బంధంలో కూడా ఇలాగే జరుగుతుందా? లేదా? అనేది ఈ విషయాల ద్వారా తెలుసుకోండి..


రక్షణ:  పార్టనర్ విషయంలో  Protection గురించి ఆలోచించడం ఆ దిశగా అడుగులు వేయడం చాలా మంచి విషయం. కానీ ఈ రక్షణ హద్దులు దాటితేనే అసలు సమస్య ఎదురవుతుంది. రోజంతా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారో తెలుసుకుంటూ మీ ప్రతి విషయంలో వేలు పెట్టడం మంచి పద్దతి కాదు. నీ మంచికోసమే, అది నా బాధ్యత, నీ ప్రేమతో అలా, నిన్ను చెడ్డ వ్యక్తుల నుంచి రక్షించడానికే ఇలా చేస్తున్నామని చెప్తారు. కానీ రక్షణ వంకతో ప్రతి క్షణం మిమ్మల్ని అంటిపెట్టుకోవడం ఒకరకమైన హింసే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

ఎవరితో కలవకుండా చేయడం:  కొంతమంది మగవారు పెద్దగా ఎవరితో కలవరు. ఎవరితో మాట్లాడరు. అంతేకాదు వారిలాగే వారి భాగస్వామి కూడా ఎవరితో మాట్లాడకూడదని భావిస్తుంటారు. ముఖ్యంగా వారితోనే ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుంటారు. ఎవరితో మాట్లాడకుండా చేయడం, కేవలం ఇంటికే పరిమితం చేయడం కూడా హింస కిందికే వస్తుంది.   
 


అందరికీ దూరంగా: కొంతమంది పురుషులు తమ భార్యలను వారి కంట్రోల్ లో ఉంచుకోవడానికి మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా వాళ్ల ఫ్రెండ్స్ తో టచ్ లో లేకుండా చేయడం, వారిని కలవనీయకుండా చేయడం, సోషల్ మీడియా పాస్ వర్డ్ లను తరచుగా మారుస్తూ ఉండటం, వారి ఫోన్ ను వారి దగ్గనే ఎక్కువగా పెట్టుకోవడం, నోటిఫికేషన్స్ ఏమొచ్చాయని తరచుగా చెక్ చేయడం వంటి పనులు కేవలం వారి పర్టనర్ మీద నమ్మకం లేకపోతేనే చేస్తుంటారని అర్థం. ఇవన్నీ కేవలం వారి భాగస్వామిని వారి చెప్పుచేతల్లో పెట్టుకోవడానికే చేస్తుంటారు. ఇదంతా కేవలం ప్రేమ పేరుతో జరిగే ఒకలాంటి హింసే. ఇలాంటి వాటిని అస్సలు గుర్తించడం కష్టతరమైంది. 
 

శారీరకంగా హింసించడం: చిన్న తప్పు చేసినా మిమ్మల్ని తిట్టడం, శారీరకంగా హింసించడం, బెదిరించడం, శిక్షలు వేయడం వంటివి మీ భర్త తరచుగా చేస్తుంటే అతడు Abuser అని అర్థం చేసుకోవచ్చు. అతనికి కోపం వచ్చినా మీపై చిందులు తొక్కడం, మిమ్మల్ని బాధపెడుతూ ఉంటే అది ఆలోచించాల్సిన విషయమే.
 

చివరగా: మీ పట్ల ఇలా ప్రవర్తించి మళ్లీ ఏం జరగనట్టు ప్రవర్తిస్తే మీరు ఆ రిలేషన్ షిప్ గురించి ఆలోచించాల్సిందే.  మీ పట్ల కఠినంగా ప్రవర్తించి క్షమాపనలు కూడా చెప్పకుంటే ఆలోచించాల్సిందే. ప్రేమతో చేశాడేమోనని మీరు బ్రమపడితే మళ్లీ ఇలాంటి విషయాలు రిపీట్ కావని ఏంటి గ్యారంటి. ఏదేమైనా ఇలా ప్రవర్తించేవారి విషయమంలో కాస్త జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. 
 

Latest Videos

click me!