Instant Dosa: పప్పు, బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు క్రిస్పీ దోశ ఇలా చేసేయండి

Published : Mar 09, 2026, 11:25 AM IST

Instant Dosa: ఎక్కువమందికి ఇష్టమైన అల్పాహారం దోశ. దక్షిణ భారతదేశంలో దోశకు అభిమానులు ఎక్కువ. అయితే దీనికి ముందుగానే బియ్యం, పప్పు నానబెట్టి రుబ్బుకోవాల్సి వస్తుంద. అలా చేయాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు దోశ ఎలా చేయాలో తెలుసుకోండి. 

PREV
13
దోశె వెరీ పాపులర్

దక్షిణ భారతదేశంలో ఏ టిఫిన్ సెంటర్ కి వెళ్ళినా కచ్చితంగా అక్కడ దోశ ఉంటుంది. ఉత్తర భారతీయులకు కూడా ఇప్పుడు దోశ ఇష్టపడే వంటకంగా మారిపోయింది. కానీ ఇంట్లో దోశ చేయాలంటే ముందుగానే పప్పును, బియ్యాన్ని కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ రెండింటినీ రుబ్బి.. పిండిని కొంతసేపు పులియ పెట్టాలి. ఆ తర్వాతే క్రిస్పీ దోశలు వస్తాయి. అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా కేవలం పావుగంటలో కూడా దోశను సిద్ధం చేసుకోవచ్చు. హోటల్ లో అమ్మిన దోశల్లాగా ఇవి క్రిస్పీగా ఉంటాయి.

23
ఇలా వండండి

క్రిస్పీ దోశ కోసం ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలో వేయాలి. అందులోనే గోధుమపిండి, శనగపిండి రెండు స్పూన్లు కలపాలి. వీటన్నింటినీ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. అరకప్పు పెరుగును కూడా వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట పాటు పక్కన వదిలేయాలి.

33
క్రిస్పీ దోశ వేసేయండి

ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ముందుగా పచ్చి ఉల్లిపాయను అడ్డంగా కోసి ఆ ఉల్లిపాయతో ఒకసారి పెనాన్ని బాగా రుద్దాలి. ఆ తర్వాతే కొంచెం ఆయిల్ వేసి పెనం మొత్తం విస్తరించేలా చూడాలి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కాక అప్పుడు గరిటతో పిండిని తీసి పెనం మీద వేసి దోశ లాగా పలుచగా విస్తరించుకోవాలి. పైన కొంచెం నెయ్యి పోసుకోవాలి. రెండు వైపులా దోశ బంగారు రంగులోకి మారేవరకు వేయించి తర్వాత కొబ్బరి చట్నీతో తినాలి. ఈ దోశ క్రిస్పీగా అదిరిపోతుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి మీ అందరికీ నచ్చడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories