Cancer: ఇటీవలి కాలంలో కొలన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) కేసులు యువతలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారిలో వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొలన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.?
ఎప్పుడో ఒకసారి కడుపు నొప్పి రావడం సాధారణ విషయం. కానీ ఒకే చోట ఎక్కువ రోజులు నొప్పి కొనసాగితే జాగ్రత్త పడాలి. నిరంతరం కడుపు నొప్పి ఉండటం కొలన్ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ముఖ్యంగా కొన్ని వారాల పాటు తగ్గకుండా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.
25
కారణం లేకుండా బరువు తగ్గడం
రెగ్యులర్‌గా ఆహారం తీసుకున్నా ఉన్నపలంగా బరువు తగ్గితే అది హెచ్చరిక సంకేతంగా భావించాలి. క్యాన్సర్ కణాలు శరీర శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తాయి. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. దుస్తులు లూజ్ అయినా, ఎలాంటి కారణంగా లేకుండా బరువు తగ్గుతున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
35
ఎప్పుడూ అలసటగా అనిపించడం
పని ఎక్కువగా ఉండటం వల్ల అలసట రావడం సాధారణం. కానీ విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోతే అది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. కొలన్ క్యాన్సర్ వల్ల లోపల రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తహీనత వస్తుంది. రక్తహీనత కారణంగా ఎప్పుడూ అలసటగా అనిపించవచ్చు.
మలంలో రక్తం కనిపించడం ముఖ్యమైన హెచ్చరిక లక్షణం. చాలామంది దీన్ని పైల్స్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రమాదకరం. మలంలో ఎరుపు లేదా నల్లటి రంగులో రక్తం కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అలాగే మల విసర్జన అలవాట్లలో మార్పులు వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రోజుల పాటు మలబద్ధకం, తరచూ విరేచనాలు, మల విసర్జన్ పూర్తిగా కాలేదనే భావన కలగడం వంటి లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగితే పరీక్షలు అవసరం. పేగుల్లో ఏర్పడే గడ్డలు మల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు.
55
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పై లక్షణాల్లో ఏదైనా ఎక్కువ రోజులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలో గుర్తిస్తే కొలన్ క్యాన్సర్‌ను సమర్థంగా నియంత్రించవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.