బంగారం ధరించడం వల్ల వ్యక్తి సంపద, ఆనందం , శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శరీరంలోని కొన్ని భాగాలు బంగారానికి చాలా ముఖ్యమైనవి, అక్కడ బంగారాన్ని ధరించడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆదివారం, బుధవారం లేదా శుక్రవారం రోజుల్లో బంగారం ధరించడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయి.
ముక్కు: ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ముక్కుకు పెట్టుకునే ఆభరణాలు ధరించాలి. ముక్కు కుట్టించుకుని అందులో బంగారం ధరించండి. ముక్కు పుడకలు, ముక్కులకు రింగ్‌లు, ప్రత్యేకమైన చిన్న ఆభరణాలు ధరించడం ఎంతో మంచిది.
చెవి: చెవికి బంగారు ఆభరణాలు ధరిస్తే వారి కేతు గ్రహం బలంగా మారుతుంది. ఆ గ్రహం బాగుంటే స్థితిగతులు బాగుంటాయి. అంటే చెవి రింగులు, చెవి దిద్దులు, లోలాకులు, చెంప పిన్నులు గోల్డ్‌వి పెట్టుకోవడం వల్ల ఈరకమైన ప్రయోజనం చేకూరుతుంది.
మెడ: భర్తతో మనస్పర్థలు, తరచూ గొడవ పడే అమ్మాయిలు వాళ్ల జీవితంలో శాంతి చేకూారాలంటే మెడకు సంబంధించిన నగలు పెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు ఉంటే, పరస్పర ప్రేమను పెంచడానికి , భార్యాభర్తల జీవితంలో ఆనందం కోసం, మెడలో బంగారం ధరించాలి. చైన్ లు, హారాలు.. ఎలాంటి రకమైనా ఫర్వాలేదు.
చూపుడు వేలు: చూపుడు వేలుకు బంగారు ఉంగరం ధరిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మానసిక బలం చేకూరుతుంది. డబ్బు సమస్యలు ఉన్నవారు వెంటనే చూపుడు వేలుకు రింగ్ ధరించండి. అయితే చాలా మంది చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటారు. కొందరికి అది చాలా ఇష్టం. కాని 90శాతం మంది చూపుడు వేలుకు గోల్డ్ రింగ్ పెట్టుకోరు. అలాంటి వాళ్లు ఇకపై పెట్టుకుంటే ఆర్దిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
ఈ శరీర భాగాలపై బంగారం ధరించవద్దు: మహిళలు నడుముకు వడ్డాణం పెట్టుకుంటారు. కానీ జ్యోతిశాస్త్రం ప్రకారం బంగారం నడుముకు ధరించకూడదు. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థకు హానికరం. గర్భాశయ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం ఉన్నవారు లేదా కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా నడుముపై బంగారం అసలే ధరించకూడదు.
(గమనిక: ఈ సమాచారం జ్యోతిషశాస్త్ర అంచనాలపై ఆధారపడి ఇచ్చిన సమాచారం మాత్రమే)