మీకు లో బీపీ ఉందా? అయితే ఈ కూరగాయను ఎక్కువగా తినకండి

First Published Feb 4, 2023, 1:50 PM IST

లో బీపీ కూడా ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. అయితే కొన్ని ఆరోగ్యకరమైన కూరగాయలు కూడా  బీపీని మరింత తగ్గించేస్తాయి. అందుకే కూరగాయలను తినేముందు అది బీపీని తగ్గిస్తుందో? లేదో? తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

బీట్ రూట్ చాలా పోషకాలతో కూడిన కూరగాయ. బీట్ రూట్ మన జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి మంటను తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బీట్ రూట్ లో ఫోలేట్, విటమిన్ బి 9, పొటాషియం, ఐరన్, మాంగనీస్, రాగి, విటమిన్ సి, మొక్కల సమ్మేళనాలు వంటి ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. 

Beetroot

బీట్ రూట్ ను తినడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. అథ్లెటిక్ పనితీరు మెరుగుపడుతుంది. బీట్ రూట్ ఫైబర్ కు మంచి మూలం. ఇది జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీట్ రూట్ లో నైట్రేట్స్ కూడా ఉంటాయి. ఇవి మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Image: Getty Images

అయితే  బీట్రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడతాయి. నిజానికి బీట్ రూట్ మన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. దీనిని బీపీ తక్కువగా ఉన్నవారు తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ బీట్ రూట్ రక్తపోటును మరింత తగ్గిస్తుంది. అయితే రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి మాత్రం ఇది మంచిది. ఎందుకంటే ఇది వీరిలో రక్తపోటును తగ్గిస్తుంది. 
 

జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ-హార్ట్ అండ్ సర్క్యులేటరీ ఫిజియాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం..  డైటరీ నైట్రేట్ రక్తపోటును తగ్గించడానికి రక్త నాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. గుండెపోటును నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ కూడా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.
 

రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి అకర్బన నైట్రేట్ లభిస్తుంది. ఇది హానికరమైన మంటను నిరోధించడానికి, నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇలా ఇది గుండెపోటును నివారించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

beetroot

బీట్ రూట్ లో ఆల్ఫా-లిపోయిక్ ఆమ్లం అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ సమ్మేళనం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

click me!