పెదాలకు ఆలివ్ ఆయిల్ రాస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published Feb 4, 2023, 12:51 PM IST

ఎండాకాలం మొదలుకాబోతున్నా.. పొద్దున, రాత్రి సమయాల్లో విపరీతమైన చలి పెడుతోంది. ఇక ఈ చలికి పెదాలు పగలడం చాలా కామన్. పగిలిని పెదాలను తిరిగి అందంగా మార్చడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆలివ్ ఆయిల్ ను పెదాలకు అప్లై చేస్తే పెదాల పగుళ్లు మటుమాయం అవుతాయి. అలాగే మీ పెదాలు గులాబి రంగులో అందంగా మెరిసిపోతాయి. 
 

chapped lips

చలికాలం పూర్తిగా ఇంకా పోలేదు. ఈ సీజన్ లో పెదాలు తరచుగా పగులుతుంటాయి. వీటిని వదిలించుకోవడానికి చాలా మంది లిప్ బామ్ లను ఉపయోగిస్తుంటారు. కొందరికీ వీటివల్ల కూడా పెదాలు తిరిగి నార్మల్ గా కావు. అయితే వీటికి బదులుగా కొన్నిన నేచురల్ పద్దతులను పాటిస్తే పెదాలు అందంగా మారుతాయి. పెదాలకు ఆలివ్ ఆయిల్ మంచి మేలు చేస్తుంది. ఇది పగిలిన పెదాలను తగ్గిస్తుంది. నిజానికి ఆలివ్ ఆయిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.  కానీ పగిలిన పెదవులకు చికిత్స చేయడానికి ఇదొక ఒక గొప్ప మార్గం.

చర్మానికి ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

ఆలివ్ ఆయిల్ పెదవులకు చేసే మేలు గురించి తెలుసుకునే ముందు మన చర్మానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.

నాభిలో ఆలివ్ ఆయిల్ ను వేయడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.
ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, స్క్వాలేన్, ఒలియోకాంతల్ వంటి పదార్థాలు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి చర్మ నష్టాన్ని పునరుద్ధరిస్తాయి.
ఇది తేమను నిలిపి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది డ్రై స్కిన్ సమస్యను తొలగిస్తుంది. అంతేకాదు మీ చర్మం యవ్వనంగా, అందంగా మెరిసిపోవడానికి సహాయపడుతుంది. 
ఆలివ్ ఆయిల్ యూవీ కిరణాల ప్రభావాన్ని తగ్గించగలదు. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
 

పెదవులకు ఆలివ్ ఆయిల్

మీకు తెలుసా చాలా రకాల లిప్ బామ్ లల్లో ఆలివ్ ఆయిల్ ను ఉపయోగిస్తారు. అయితే ఆలివ్ ఆయిల్ ను నేరుగా పెదవులకు అప్లై చేసినా పెదవులు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ నూనె మీ పెదవులు పగిలిపోకుండా కాపాడుతుంది . కాబట్టి పెదవులు పొడిబారినట్లు అనిపిస్తే రాత్రిపూట కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయండి. నేచురల్ లిప్ స్క్రబ్ ను తయారుచేయడానికి మీరు ఆలివ్ ఆయిల్ ను చక్కెరతో కలపొచ్చు. చక్కెర మీ పెదవులను ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా చేస్తుంది. అలాగే పొడి లేదా చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.
 

lips

ఆలివ్ ఆయిల్ పెదాలను గులాబీ రంగులోకి మారుస్తుందా?

పెదాలను పింక్ కలర్ లోకి మార్చడానికి ఎన్నో లిప్ బామ్ లు, లిప్ స్టిక్ లు ఉన్నాయి. అయినప్పటికీ.. సహజమైన పింక్ లిప్స్ ను పొందడానికి ఎక్స్ ఫోలియేషన్ బాగా సహాయపడుతుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, చర్మాన్ని పునరుద్ధరించడానికి పెదాల ఎక్స్ఫోలియేషన్ అవసరమని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, ఆలివ్ ఆయిల్ స్క్రబ్ ఉపయోగించడం ద్వారా పెదాలను ఎక్స్ఫోలియేట్ చేయడానికి, వాటికి పోషణ అందించడానికి ఉత్తమ పద్ధతి. వారానికి కనీసం మూడు సార్లు 30 సెకన్ల పాటు దీన్ని ఉపయోగించండి.
 

dry lips

పెదవులకు ఆలివ్ ఆయిల్ వర్సెస్ కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అయితే కొబ్బరి నూనెతో పోలిస్తే ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో కనిపించే అనేక కొవ్వు ఆమ్లాలు పెదాలను మృదువుగా చేయడానికి సహాయపడతాయి. రోజంతా మీ పెదవులను తగినంత తేమగా, హైడ్రేట్ గా ఉంచడానికి ఇది చాలా అవసరం. కాబట్టి కొబ్బరి నూనె మీ పెదవులు పగిలిపోకుండా లేదా పొడిగా మారకుండా ఉండటానికి సహాయపడుతుంది. కొద్దిగా కొబ్బరినూనెను పెదవులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చనిపోయిన చర్మం, మీ పెదవుల పొడి బయటి పొరను తొలగిస్తుంది.

వాస్తవం ఏంటంటే.. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె రెండింటిలో హైడ్రేటింగ్ లక్షణాలు ఉంటాయి. ఈ రెండూ పెదవులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి పిగ్మెంటేషన్ ను కూడా తగ్గిస్తాయి. పెదాలను గులాబీ రంగులోకి మారుస్తాయి. 

click me!