టైప్ -2 డయాబెటిస్, క్యాన్సర్ మరణాల మధ్య సంబంధం
అనేక శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ వల్ల రక్తంతో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదంతో ముడిపడి ఉంది. ఒక దశాబ్దానికి పైగా.. 2, 00,000 మందికి పైగా వ్యక్తులను అనుసరించిన ఒక అధ్యయనం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు.. లేనివారితో పోల్చితే క్యాన్సర్ తో చనిపోయే ప్రమాదం 13 శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. కాలేయం, క్లోమం, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు ఉన్నవారు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందట.