మీ లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి

First Published Dec 10, 2022, 1:55 PM IST

కాలెయం మనం తీసుకున్న ఆహారాల ద్వారా శరీరంలోకి వెళ్లిన విషపదార్థాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

కాలేయం మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. మన శరీరంలోని అతిపెద్ద అవయవం కూడా ఇదే. ఇది రక్తాన్ని వడపోయడంతో పాటుగా గాయం అయినప్పుడు రక్తం కారడాన్ని ఆపేందుకు  అవసరమైన పదార్థాలను తయారుచేస్తుంది. అలాగే ఎన్నో ముఖ్యమైన శారీరక విధులను నిర్వహిస్తుంది.  కాలుష్యం, కలుషితమైన నీరు, ఆహారం, చెడు జీవనశైలి వంటి కొన్ని కారకాలు, కొన్ని వ్యాధులు  కాలేయాన్ని దెబ్బతీస్తున్నాయి.

 కాలెయం కూడా ఒక గ్రంథే. ఎందుకంటే ఇది శరీరంలోని ఇతర భాగాలకు అవసరమైన ప్రోటీన్లు, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కాలేయం మన రక్తం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర, హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ అవయవం పిత్తం, రక్త శుద్ధి, మెరుగైన జీర్ణ ఆరోగ్యం, అవసరమైన ఖనిజాలు,  విటమిన్ల నిల్వ వరకు ఎన్నో విధులను నిర్వహిస్తుంది.  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల ఆహారాలు కూడా కాలెయ ఆరోగ్యానికి సహాయపడతాయి. కాలెయం ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


1. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కాలెయ ఆరోగ్యం బాగుంటుంది.  ఈ నీటిని పరిగడుపున తాగితే కాలెయ సమస్యలు తగ్గిపోతాయి. 

2. రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. నీరు కాలేయం, మూత్రపిండాలను శుద్ధి చేయడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

3. ఒక గ్లాస్ క్యారెట్లు, బీట్ రూట్, బచ్చలికూర జ్యూస్ లేదా ఒక గ్లాసు వీట్ గ్రాస్ జ్యూస్ ను తాగండి. ఈ రెండూ కాలెయాన్ని పరిశుభ్రపరుస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

4. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ ఆహారంలో కనీసం 40% పండ్లు, కూరగాయలు ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియకు సహాయపడుతాయి. విషాన్ని తొలగించే కాలేయ సామర్థ్యాన్ని పెంచుతాయి.

5. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శుద్ధి చేసిన చక్కెర, మైదా పిండితో చేసిన ఆహారాలను తినడం మానుకోండి. రెండు పదార్థాలు కాలేయాన్ని మరింత గట్టిగా చేస్తాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది.

6. ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వీటిలో సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

7. గ్రీన్ టీ కూడా కాలెయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ప్రతిరోజూ సాయంత్రం వేల కప్పు గ్రీన్ టీ తాగితే కాలెయ వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

8. క్యాబేజీ, బ్రోకలీ, కలీఫ్లవర్ వంటి కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఎంతో సహాయపడతాయి. ఇవి లివర్ ఎంజైమ్ల లెవెల్స్ ను మెరుగుపరుస్తాయి. 

9. వాల్ నట్స్ కూడా కాలెయ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఉదయం పరిగడుపున నానబెట్టిన వాల్ నట్స్ ను తింటే ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

click me!