
సూర్యరశ్మిలో కాసేపు పడుకోవడాన్ని లేదా కూర్చోవడాన్ని సన్ బాత్ అంటారు. నిజానికి చలికాలంలో సన్ బాత్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సన్ స్క్రీన్ లేకుండా కాసేపు ఎండలో గడిపితే తేడాను మీరే గమనిస్తారు. అలా అని సూర్యరశ్మి మరీ ఎక్కువ ఉన్నప్పుడు.. ఎండలో ఉంటే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే మన శరీరానికి తగినంత సూర్యరశ్మిలో గడపటం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది
అధిక రక్తపోటుతో బాధపడేవారికి సన్ బాత్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సన్ బాత్ చర్మం పై పొరలో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ ను ప్రేరేపించడానికి సహాయపడుతుంది. దీంతో రక్త ధమనులను విస్తరిస్తాయి. ఇది రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
నిద్రను మెరుగుపరుస్తుంది
మన శరీరం ఉత్పత్తి చేసే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను ప్రోత్సహించడానికి చాలా చాలా అవసరం. పలు పరిశోధనల ప్రకారం.. ఉదయాన్నే ఒక గంటపాటు సహజ కాంతిని పొందడం వల్ల మీ నిద్ర మెరుగుపడుతుంది. మెలటోనిన్ ను ఎప్పుడు ఉత్పత్తి చేయాలో మీ శరీరానికి సూచించడం ద్వారా.. సూర్యరశ్మి మీ సిర్కాడియన్ లయను నియంత్రిస్తుంది.
నిరాశను పోగొడుతుంది
ఎండలో కాసేపు గడిపిన తర్వాత నిరాశ, నిస్పృహ లక్షణాలు చాలా వరకు తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎండ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సెరోటోనిన్ అనే హార్మోన్ సూర్యరశ్మి ద్వారా విడుదల అవుతుంది. ఉదయం గంట సేపు ఎండలో గడిపితే మీరు ఎలాంటి నిరాశ లేకుండా ఉంటారు. అలాగే మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది.
విటమిన్ డి అందిస్తుంది
మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇందుకోసం ప్రతిరోజూ ఉదయాన్నేకాసేపు ఎండలో నిలబడితే చాలు. నిజానికి మనదేశంలో సూర్యరశ్మికి ఎలాంటి లోటు లేకున్నా.. విటమిన్ డి లోపంతో బాధపడేవారు మాత్రం చాలా మందే ఉన్నారు. ఈ విటమిన్ డి శరీరాన్ని ఫ్లూతో సహా ఎన్నో అనారోగ్యాల సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలను ఉంచడానికి చాలా అవసరం. సూర్యరశ్మికి ప్రతిస్పందనగా మన శరీరం విటమిన్ డి ని ఉత్పత్తి చేస్తుంది.
క్యాన్సర్ ను నివారించవచ్చు
ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. సన్ బాత్ తో ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారించొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే విటమిన్ డి లేకపోవడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉది. మన చర్మం సూర్య రశ్మిలో ఉన్నప్పుడు విటమిన్ డి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల కొన్ని క్యాన్సర్లను నివారించబడతాయి. ఇందుకోసం చర్మంపై ఎటువంటి లోషన్ లేదా నూనె రాయకుండా ప్రతిరోజూ ఎండలో గడపడం చాలా ముఖ్యం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
అంటువ్యాధులు, సోరియాసిస్ వంటి ఎన్నో స్వయం ప్రతిరక్షక వ్యాధులతో పోరాడటానికి సూర్యరశ్మి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ డి స్థాయిలను పెంచడానికి, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఎన్నో వైరల్ వ్యాధులతో పోరాడటానికి ఉదయం ఎండలో 10 నుంచి 15 నిమిషాలు సన్ బాత్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Sunbath
ఎముకలను బలంగా చేస్తుంది
విటమిన్ డి పొందడానికి గొప్ప, సరళమైన మార్గాలలో ఒకటి సూర్యరశ్మిలో నిలబడటం. సూర్యరశ్మిలో ఉండటం వల్ల మన శరీరాలు విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయి. మీకు ఫెయిర్ స్కిన్ ఉంటే ప్రతిరోజూ 15 నిమిషాలు ఎండలో ఉండండి. విటమిన్ డి కాల్షియంను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే పెళుసైన, సన్నని లేదా రూపవికృతి చెందిన ఎముకలను నివారిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది
ఎండ మెలటోనిన్ ను ఉత్పత్తిచేయడానికి మీ శరీరానికి సహాయపడుతుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. మెలటోనిన్ ఒత్తిడి రియాక్టివిటీని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.