Tandoori Egg Recipe: తందూరీ చికెన్‌లాగే.. తందూరీ ఎగ్ వండుకుంటే అదిరిపోతుంది, ఇదిగో ఈజీ రెసిపీ

Published : Nov 04, 2026, 05:00 PM IST

Tandoori Egg Recipe: సాధారణ గుడ్లు కూరలు తిని బోర్ కొట్టిందా? అయితే పెరుగు, ఘాటైన మసాలాలు వేసి కడాయిలోనే హోటల్ స్టైల్ ఎగ్ తందూరీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, టేస్ట్ పెంచే టిప్స్ మీకోసం.

PREV
13
ఎగ్ తందూరీ రెసిపీ

గుడ్లను ఎప్పుడూ ఉడకబెట్టుకుని లేదా ఆమ్లెట్ వేసుకుని తింటే బోర్ కొడుతుంది కదా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, స్పైసీగా ఎగ్ తందూరీ ట్రై చేయండి. పెరుగు, మసాలా పొడులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కలిపిన మిశ్రమంలో గుడ్లను నానబెట్టి, కడాయిలో దోరగా వేయిస్తే చాలు. పైన మసాలాతో క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ ఎగ్ తందూరీ ఈవెనింగ్ స్నాక్స్‌కి, పార్టీ స్టార్టర్స్‌కి పర్ఫెక్ట్. తందూరీ పొయ్యి లేకుండానే ఇంట్లో హోటల్ స్టైల్ టేస్ట్‌తో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

23
ఎగ్ తందూరీకి కావాల్సిన పదార్థాలు
  • గుడ్లు - 4
  • గట్టి పెరుగు - 4 టేబుల్ స్పూన్లు
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • పసుపు - 1/4 టీస్పూన్
  • మిరియాల పొడి - 1/2 టీస్పూన్
  • గరం మసాలా - 1/2 టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • నిమ్మరసం - 1 టీస్పూన్
  • కసూరి మేతి - 1/2 టీస్పూన్
  • ఆవనూనె - తగినంత
  • ఉప్పు - తగినంత
  • కొత్తిమీర - కొద్దిగా
33
ఎగ్ తందూరీ రెసిపీ
  1. గుడ్లను ఉడకబెట్టి, చల్లారాక పొట్టు తీయాలి. ఆ తర్వాత చాకుతో గుడ్ల పైన తేలికగా గాట్లు పెట్టాలి. ఫోర్క్ స్పూన్‌తో మెల్లగా గుచ్చాలి. ఇలా చేయడం వల్ల మసాలా గుడ్డు లోపలికి బాగా వెళ్లి టేస్ట్ పెరుగుతుంది

2. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పెరుగు, ధనియాల పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేయాలి.

3. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, కసూరి మేతి కలపాలి. ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

4. ఉడకబెట్టి పొట్టు తీసిన గుడ్లను ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. గుడ్ల చుట్టూ మసాలా బాగా పట్టేలా మెల్లగా తిప్పాలి. ఇలా మసాలా పట్టించిన గుడ్లను 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి.

5. ఒక దోశ పెనం లేదా వెడల్పాటి కడాయిలో ఆవనూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. మసాలా పట్టించిన గుడ్లను పొడవాటి పుల్లలకు గుచ్చుకోవచ్చు. పుల్లలు లేకపోతే నేరుగా కడాయిలో వేసి కూడా వేయించుకోవచ్చు.

6. గుడ్లను కడాయిలో పెట్టి, అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. అన్ని వైపులా మసాలా గోల్డెన్ కలర్‌లోకి మారి, కాస్త కాలిన తందూరీ లుక్ వచ్చే వరకు వేయించాలి.

7. మసాలా త్వరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి, మీడియం మంట మీదే జాగ్రత్తగా వేయించడం ముఖ్యం. అవసరమైతే కొద్దిగా నూనె చల్లుకోవచ్చు.

8. వేయించిన గుడ్లను ఒక ప్లేట్‌లోకి తీసుకుని, పైన కొద్దిగా చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి. వేడివేడి ఎగ్ తందూరీని పుదీనా చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో వడ్డిస్తే టేస్ట్ అదుర్స్.

Read more Photos on
click me!

Recommended Stories