DMart: దీపావళి వచ్చిందంటే డీమార్ట్‌లలో సందడే సందడి. పండుగ సరుకుల నుంచి స్వీట్లు, డెకరేషన్ ఐటమ్స్ వరకు కొనుగోలుదారులతో స్టోర్లు కిటకిటలాడుతుంటాయి. అయితే రద్దీలో గంటల తరబడి గడపకుండా షాపింగ్ చేయాలంటే ఏ రోజు, ఏ సమయంలో డీమార్ట్‌కు వెళ్లాలి?
దీపావళి పండుగ వస్తుందంటే చాలు షాపుల్లో జనం రద్దీ మామూలుగా ఉండదు. బట్టలు, సరుకులు, స్వీట్లు, డెకరేషన్ వస్తువులు కొనేందుకు జనం క్యూ కడతారు. తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి. కాబట్టి చాలామంది డీమార్ట్‌కే వెళ్తుంటారు. పండుగ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సరైన రోజు, సమయం చూసుకుని వెళ్లడం చాలా ముఖ్యం. అప్పుడే గంటల తరబడి వెయిట్ చేయకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు.
25
లాస్ట్ మినిట్ షాపింగ్ వద్దు
పండుగకు ముందు రోజు షాపింగ్‌కు వెళ్లకపోవడమే మంచిది. దానికి బదులు రెండు మూడు రోజుల ముందే డీమార్ట్‌కు వెళ్లండి. లాస్ట్ మినిట్‌లో వెళితే మీకు కావాల్సిన వస్తువులు స్టాక్ ఉండకపోవచ్చు. పైగా జనం ఎక్కువగా ఉండటం వల్ల ప్రశాంతంగా వస్తువులను ఎంచుకోలేరు. అందుకే ముందుగానే కావాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకోవడం బెటర్.
35
ఉదయం పూట వెళితే రద్దీ ఉండదు
డీమార్ట్‌కు వెళ్లే టైమ్ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం పూట వెళ్లడం బెస్ట్ ఆప్షన్. ఆ టైమ్‌లో జనం కాస్త తక్కువగా ఉంటారు. ఎలాంటి హడావుడి లేకుండా కావాల్సినవి కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రద్దీ పెరుగుతుంది. ఆఫీస్ అయిపోయాక వచ్చేవాళ్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి బిల్లింగ్ దగ్గర చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది.
శని, ఆదివారాల్లో ఫ్యామిలీతో కలిసి షాపింగ్ చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల డీమార్ట్‌లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో వెళ్లండి. వీక్ డేస్‌లో ఉదయం పూట వెళితే రద్దీని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల టైమ్ సేవ్ అవుతుంది, ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు.
55
ముందుస్తు ప్లానింగ్ చాలా ముఖ్యం
దీపావళి షాపింగ్ ప్రశాంతంగా ముగించాలంటే ముందుస్తు ప్లానింగ్ తప్పనిసరి. కొనాల్సిన వస్తువుల లిస్ట్ రాసుకుని, పండుగకు రెండు మూడు రోజుల ముందే వెళ్లండి. వీక్ డేస్‌లో ఉదయం పూట వెళ్లేందుకు ట్రై చేయండి. దీనివల్ల లాస్ట్ మినిట్ టెన్షన్, క్యూలో నిలబడే బాధ తప్పుతుంది. అయితే, ఏరియాను బట్టి రద్దీ మారొచ్చు. ఇవి కేవలం రద్దీని అవాయిడ్ చేసేందుకు మాత్రమే, ఆఫర్ల కోసం కాదు.