Land Of Lemons: ప్రతి ఇంట్లోనూ లభించే నిమ్మకాయలకు స్పెషల్ గా మన దేశంలో ఒక రాజధాని కూడా ఉంది. ఇక్కడ కాసినన్ని నిమ్మకాయలు మన దేశంలో మరెక్కడా కాయవు. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే ఏకైక నిమ్మకాయ ఇదే..
మన కిచెన్ లో రెగ్యులర్ గా వాడే వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి. మనం నిమ్మకాయను చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. కమ్మని షర్బత్ దగ్గర నుంచి.. చాలా రకాల వంటలకు రుచిని తేవడంలో నిమ్మకాయ చాలా బాగా సహాయపడుతుంది. అయితే.. ఈ చిన్న నిమ్మకాయ వెనక ఒక నగర చరిత్రే దాగి ఉందంటే మీరు నమ్మగలరా? అసలు.. నిమ్మకాయ రాజధాని ఏది? దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ మాత్రమే దొరికే స్పెషల్ నిమ్మకాయలు ఏవో ఇప్పుడు చూద్దాం...
23
ల్యాండ్ ఆఫ్ లెమన్స్..
మన దేశంలో నిమ్మకాయలు ఎక్కువగా పండే ప్రదేశం కర్ణాటక రాష్ట్రం. చాలా మంది నిమ్మకాయను కేవలం ఒక కిచెన్ లో దొరికే సాధారణ వస్తువుగా చూస్తారు. కానీ, కర్ణాటకలోని ఓ నగరానికి ప్రాంతీయ గుర్తింపు, జీవన ఆధారం తెచ్చింది ఈ చిన్న నిమ్మకాయే. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండీ అనే ప్రాంతం ల్యాండ్ ఆఫ్ లెమన్స్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రత్యేకమైన కాగ్జీ నిమ్మకాయ పండుతుంది. దీనినే ఇండీ లైమ్ అని కూడా పిలుస్తారు. 1900ల ప్రారంభం నుంచే ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని ఇండ్లీలో నిమ్మసాగును ప్రారంభించారు. ముఖ్యంగా ఇండీ, సిందగి తాలుకాలు కాగ్జీ నిమ్మరకాన్ని ఎక్కువగా సాగు చేశారు.
ఈ ప్రాంతానికి ‘ ల్యాండ్ ఆఫ్ లెమన్స్’ అనే పేరు ఎలా వచ్చింది?
దీనికి ప్రధాన కారణం ఇక్కడ నిమ్మగాసు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. దీని వెనక సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. ICAR (భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి) నివేదికల ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తయ్యే మొత్తం నిమ్మకాయలలో దాదాపు 58% భాగం ఒక్క విజయపుర జిల్లా నుంచే వస్తుంది. అందులోనూ 'ఇండీ' ప్రాంతం ఈ కాగ్జీ నిమ్మ ఉత్పత్తికి అత్యంత కీలకమైన కేంద్రం. ఒక శతాబ్దానికి పైగా ఇక్కడ నిమ్మ సాగు చేస్తుండటంతో, ఈ రకానికి "ఇండీ లైమ్" (Indi Lime) అనే పేరే స్థిరపడిపోయింది. ఈ ప్రాంత ప్రజల ఆదాయం కూడా ఈ నిమ్మ సాగు మీదే ఆధారపడి ఉంటుంది.
33
ఇండీలో మాత్రమే పండే.. ఈ కాగ్జీ నిమ్మ స్పెషాలిటీ ఏంటి?
మన సాధారణ మార్కెట్లో చూసే నిమ్మకాయలతో పోలిస్తే ఇండీలో పండే కాగ్జీ నిమ్మకాయ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ నిమ్మకాయ తొక్క కాగితం మాదిరి చాలా పలచగా ఉంటుంది. కాయ పరిమాణంలోనూ పెద్దగా ఉంటుంది. అంతేకాదు.. ఈ కాయల్లో రసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాయ నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రత్యేక గుణాల వల్ల ఊరగాయలు, శీతల పానీయాలు, జ్యూస్ కాన్సంట్రేట్ల తయారీలో ఇండీ నిమ్మకాయలకు అత్యధిక గిరాకీ ఉంటుంది.
GI ట్యాగ్ సాధించిన నిమ్మకాయ..
ఇండీ నిమ్మకాయల ప్రాంతీయ విశిష్టతకు 2023లో భౌగోళిక గుర్తింపు( జీఐ ట్యాగ్ ) లభించింది. విజయపుర జిల్లా వాతావరణం, అక్కడి మట్టి గుణాల వల్ల మాత్రమే ఈ నిమ్మకాయలకు అంతటి ప్రత్యేక రుచి, సువాసన వస్తాయని ఈ జీఐ ట్యాగ్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించారు. ఈ గుర్తింపు వచ్చిన తర్వాత ఇండీ నిమ్మకాయలు అంతర్జాతీయ మార్కెట్ లోనూ మంచి గుర్తింపు సాధించాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, బ్రిటన్ వంటి దేశాలకు ఇక్కడి నిమ్మకాయలే ఎగుమతి అవుతున్నాయి.