Stains Remove: ఇవి రాస్తే, ఎలాంటి మొండి మరకలైనా వదలాల్సిందే..!

Published : May 26, 2025, 10:19 AM ISTUpdated : May 26, 2025, 10:37 AM IST

దుస్తులపై పసుపు, కాఫీ లాంటివి పడి ఆ మరకలు ఎంత ఉతికినా వదలడం లేదా? అయితే, వాటిని సింపుల్ గా వదిలించే చిట్కాలు ఉన్నాయి.

PREV
15
మొండి మరకలకు ఇలా చెక్ పెట్టండి

మనలో చాలా మందికి కొన్ని ఫేవరేట్ దుస్తులు ఉంటాయి. అలాంటి దుస్తులను చాలా స్పెషల్ రోజున ధరించాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు.. ఆ డ్రెస్ కి ఏదైనా చిన్న మకర పడినా తట్టుకోలేరు. ఆ మరకలను తొలగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని మొండి మరకలు వదలవు. మీరు కూడా అలా చేసి విసిగిపోయారా? అయితే, మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. మీ కిచెన్ లో లభించే కొన్ని వస్తువులను మరకలపై రుద్దితే ఎలాంటి మొండి మరకలు అయినా కూడా ఈజీగా తొలగిపోతాయి. మరి, ఏం రాస్తే, ఆ మరకలు వదులుతాయో ఇప్పుడు చూద్దాం...

25
1.నిమ్మకాయ లేదా వెనిగర్ వాడితే చాలు..

ఎలాంటి మొండి మరక అయినా ఇంట్లో లభించే కొన్ని ఉత్పత్తులు వాడి వదిలించవచ్చు. అందులో నిమ్మరసం, వెనిగర్ ముందు వరసలో ఉంటాయి. ఈ రెండూ ఎలాంటి మరక ని అయినా ఈజీగా తొలగించడంలోనూ సహాయం చేస్తాయి. ఎందుకంటే, ఈ రెండింటిలో ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ఇవి మరకను తొలగించడంలో హెల్ప్ చేస్తాయి. మొండి మరక మీద నిమ్మరసం లేదా వెనిగర్ వేసి రుద్దాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే మరక పోతుంది. ఒక్కసారికే పోకపోయినా ఇలా రెండు, మూడుసార్లు చేస్తే మరక పోతుంది.

35
బేకింగ్ సోడా మిశ్రమం

మొండి పసుపు మరకలను తొలగించడానికి, లిక్విడ్ డిటర్జెంట్‌తో కలిపిన బేకింగ్ సోడాను ఉపయోగించండి. ద్రవాన్ని నేరుగా మరక మీద పూయాలి. తర్వాత.. బేకింగ్ సోడా చల్లాలి. ఈ రెండింటిని కలిపి మరక మీద పూసి.. రుద్దాలి. 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఉతికితే సరిపోతుంది. పసుపు మరకలు ఈజీగా పోతాయి.

45
హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం

హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మొండి మరకలను వదిలించడానికి, ఒక టేబుల్ స్పూన్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను రెండు టేబుల్ స్పూన్ల నీటితో కలిపి నేరుగా మరక మీద పూయాలి. దానిని 15 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత నీటితో శుభ్రం చేయాలి.అయితే, హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దానిలో ఉండే బ్లీచింగ్ దుస్తులను నాశనం చేస్తాయి.

55
మరకలను విచ్ఛిన్నం చేయడానికి ఆల్కహాల్

దుస్తుల నుండి మరకలను తొలగించడానికి ఆల్కహాల్ మంచి పరిష్కారం. ఆల్కహాల్‌లో కాటన్ బాల్‌ను నానబెట్టి, మరకపై సున్నితంగా రుద్దండి. ఆల్కహాల్ ఫాబ్రిక్‌కు మరకను పట్టి ఉంచే జిడ్డుగల సమ్మేళనాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories