దానిమ్మ పండ్లను రోజూ తింటే ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

First Published Oct 4, 2022, 4:56 PM IST

దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే వీటిని రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 
 

దానిమ్మ పండులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. మీకు తెలుసా.. దానిమం పండ్లు క్యాన్సర్ ను కూడా నివారించడంలో సహాయపడుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ దానిమ్మ గింజలు గుండెను  ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.  తియ్యగా, పుల్లగా ఉండే దానిమ్మ పండును సలాడ్లు, జ్యూస్ గా చేసుకుని తాగుతుంటారు. రోజూ దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి రోగాలు తగ్గిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ప్లేవనాయిడ్లు, యాంటీ  ఆక్సిడెంట్లు మీ కణాలను రక్షిస్తాయి. ముఖ్యంగా ఫ్రీరాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ పండులో ఈ రెండు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్, ఊరిపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. అంతేకాదు ఈ పండ్లు చర్మం, ఊపిరితిత్తుల, పెద్దపేగు లను ప్రాణాంతక రోగాలను నుంచి రక్షిస్తాయని నిరూపించబడింది. 

యాంటీ ఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఫ్రీరాడికల్స్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ యాంటీ  ఆక్సిడెంట్లు శరీర కణనాలను రక్షిస్తాయి. ఫ్రీరాడికల్స్ మన శరీరంలో ఎప్పుడూ ఉన్నప్పటికీ వాటిలో కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయి. 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

దానిమ్మ పండులో పాలీఫెనాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ జ్యూస్ గుండెపోటును తగ్గిస్తుంది. అలాగే ధమనుల్లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా శరీర మంటను కూడా తగ్గిస్తుంది. స్ట్రోక్, గుండెపోటుకు దారితీసే అథెరోస్ల్కెరోటిక్ ఫలకం అభివృద్ధి చెందకుండా చూస్తుంది. 
 

మధుమేహులకు మేలు చేస్తుంది
 
మధుమేహులకు దానిమ్మ పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది. మన శరీరం ఇన్సులిన్ హార్మోన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు మధుమేహం బారిన పడతారు. అందుకే మధుమేహులు దానిమ్మపండును తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది

ఓ పరిశోధన ప్రకారం.. దానిమ్మ రసం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుందని వెల్లడైంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. దానిమ్మ పండు కిడ్నీల్లో రాళ్లను ఏర్పరిచే ఆక్సలేట్లు, కాల్షియం, ఫాస్పేట్ల రక్త స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 
 

కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది

అథెరోస్క్లెరోసిస్ వల్లే గుండె జబ్బులు వస్తాయి. అథెరోస్క్లెరోసిన్ అంటే ధమనుల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడమని అర్థం. తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్ ధమనులను అడ్డుకుంటుంది. దీన్ని తగ్గించడంలో దానిమ్మ రసం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు అధిక సాంద్రత కలిగిన అంటే మంచి కొలెస్ట్రాల్ ను ఇది పెంచుతుంది. దీంతో స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. 
 

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు

దానిమ్మ పండ్లు ఫైటోకెమికల్స్ వ్యాధికారక  బ్యాక్టీరియా, ఈస్ట్, శిలీంద్రాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. నోటి దుర్వాసన, దంతక్షయానికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. దానిమ్మ పండ్లు నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని వెల్లడైంది. 
 

మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి

దానిమ్మ పండ్లు ఆక్సీకరణ  ఒత్తిడి, మంట వంటి రుగ్మతల నుంచి మీ మెదడును రక్షిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గడం, మెదడు కణాల మనుగడ పెరగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుందట. మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  
 

click me!