భార్యాభర్తలు జాగ్రత్త.. శృంగారానికి ముందు తర్వాత ఈ పనులను అస్సలు చేయకూడదు?

First Published | Oct 4, 2022, 3:41 PM IST

ఈ ప్రపంచంలో ప్రతి జీవికి తిండి, నీరు, గాలి, ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం.
 

ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది శృంగారంలో పాల్గొనే సమయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పులు చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే శృంగారం చేసే ముందు చేసిన తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం...
 

సాధారణంగా భార్యాభర్తల శృంగారంలో పాల్గొనే ముందు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. శృంగారంలో పాల్గొనే ముందు తప్పనిసరిగా శుభ్రంగా స్నానం చేయడం ఎంతో అవసరం. ఇలా స్నానం చేసిన తరువాత శృంగారంలో పాల్గొనడం వల్ల ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. చాలామంది శృంగారానికి ముందు ఆల్కహాల్ తాగటం వల్ల ఎంతో తృప్తి పొందుతారని భావిస్తారు. అయితే ఆల్కహాల్ సేవించి శృంగారంలో పాల్గొనకూడదని నిపుణులు చెబుతున్నారు.
 


ఇకపోతే చాలామంది సెక్స్ టాయ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివారు ఆ టాయ్స్ చాలా శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి లేదంటే ఎన్నో ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శృంగారంలో పాల్గొనే ముందు ఫైబర్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తినడం ఎంతో మంచిది. ఇకపోతే చాలామంది వివిధ భంగిమలలో సెక్స్ చేస్తుంటారు.ఇలా వివిధ భంగిమలలో సెక్స్ లో పాల్గొని వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతుంది.
 

వివిధ భంగిమలలో సెక్స్ లో పాల్గొనేవారు వారి పడక ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మన శరీరంలో ఇతర భాగాలు తీవ్ర ఇబ్బందులు నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక శృంగారం తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాల్సి ఉంటుంది. స్నానం చేయకపోయినా కనీసం జననేంద్రియాలు శుభ్రం చేసుకోవడం వల్ల ఎలాంటి అంటూ వ్యాధులు సోకకుండా ఉంటాయి.
 

ఇక పెళ్లయిన వారు త్వరగా గర్భం రావాలి అనుకునేవారు సెక్స్ లో పాల్గొన్న తర్వాత మహిళలు పొత్తికడుపును కాస్త పైకి ఎత్తాలి. అలాగే సెక్స్ చేసిన వెంటనే జననేంద్రియాలు శుభ్రం చేసుకోకూడదు. ఇలా ఉన్నప్పుడే శుక్రకణాలు అండంతో ఫలదీకరణ జరిగి తొందరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. అయితే గర్భం అవసరం లేదు అనుకున్న వారు వెంటనే జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడం మంచిది.
 

ఇకపోతే శృంగారానికి ముందు చిక్కుళ్ళు తృణధాన్యాలు తీసుకోకూడదు వీటిని తీసుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఏర్పడటం వల్ల సెక్స్ లో ఏమాత్రం తృప్తి ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఇలాంటి తృణధాన్యాలు చిక్కుళ్ళు తిన్నప్పటికీ శృంగారానికి ముందు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇక శృంగారంలో పాల్గొనే వారిలో సెరిటోనియం స్థాయిలో పెరగడం కోసం ఒక చిన్న చాక్లెట్ ముక్కను తినవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

Latest Videos

click me!