Kitchen Hack: వంట చేసేటప్పుడు ఈ 10 తప్పులు చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఆపేయండి

Published : Sep 16, 2026, 01:12 PM IST

Kitchen Hack: వంట ఎప్పుడూ చేసేదే కదా అని కొన్నిసార్లు కొన్ని విషయాలను పట్టించుకోం.కానీ తెలియకుండా చేసిన పొరపాట్ల వల్ల వంట రుచి తగ్గడమే కాకుండా ఫుడ్ క్వాలిటీ పాడవుతుంది. అయితే రెగ్యులర్ గా జరిగే 10 తప్పులు ఏంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
కూరగాయలు ఎప్పుడు కడగాలి?

చాలా మంది రెగ్యూలర్ గా కూరగాయలను ముక్కలుగా కోసి తర్వాత కడుగుతుంటారు. అలా చేయడం వల్ల పోషకాలు పోతాయి. వీలైనంత వరకు కూరగాయలను ముందుగా కడిగి...ఆ తర్వాత కోయడం మంచిది.

ఉప్పు ఒకేసారి ఎక్కువగా వేయడం

వంట మొదట్లోనే ఎక్కువ ఉప్పు వేసి తర్వాత రుచి చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. కూర ఉడికే కొద్దీ రుచి మారుతుంది. అందుకే ఉప్పును కొద్దికొద్దిగా వేసుకుంటూ.. మధ్యలో రుచి చూసి అవసరాన్ని బట్టి సర్దుబాటు చేయడం మంచిది.

25
కత్తి పదును లేకపోయినా ఉపయోగించడం

కత్తి పదును లేకపోతే కూరగాయలను సులభంగా కోయలేం. అంతేకాదు.. గట్టిగా ఒత్తిడి పెట్టాల్సి రావడంతో చేతికి గాయం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే కిచెన్ కత్తులను ఎప్పటికప్పుడు పదునుగా, శుభ్రంగా ఉంచడం మంచిది.

వంట రుచి చూసి చివర్లో మాత్రమే సర్దుబాటు చేయడం

వంట పూర్తయ్యే వరకు ఉప్పు, కారం, పులుపు సరిగ్గా ఉన్నాయో చూడకుండా చివర్లో మాత్రమే సర్దుబాటు చేస్తే రుచిని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. వంట మధ్యలో ఒకసారి రుచి చూసి అవసరమైనవి వేసుకోవాలి.

35
వేయించేటప్పుడు నూనె పొగ వస్తోందా?

నూనె బాగా పొగ వచ్చే వరకు వేడి చేయడం

నూనెను ఎక్కువగా వేడి చేస్తే పొగ వచ్చేస్తుంది. అలా వచ్చాక వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. నూనె ఎక్కువగా వేడి చేస్తే నాణ్యత మారే అవకాశం ఉంటుంది. అందుకే నూనెను సరైన ఉష్ణోగ్రతకు వేడి చేసిన తర్వాతే తాలింపు వేసుకోవాలి.

మసాలాలను ఎక్కువసేపు వేయించడం

పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వంటి పొడులను నూనెలో ఎక్కువసేపు వేయిస్తే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో కూరకు చేదు రుచి రావచ్చు. మసాలాలు వేసిన తర్వాత అవసరమైనంతసేపు మాత్రమే వేయించి.. వెంటనే తదుపరి పదార్థాలు వేయడం మంచిది.

45
కూరల్ని ఇలా ఉడికించాలి

అన్నింటినీ ఒకేసారి పాన్‌లో వేయడం

ప్రతి పదార్థానికి ఉడికే సమయం వేర్వేరుగా ఉంటుంది. కానీ కొందరు ఉల్లిపాయ, టమాటా, కూరగాయలు, మసాలాలు అన్నింటినీ ఒకేసారి పాన్‌లో వేస్తారు. ఇలా చేస్తే కొన్ని పదార్థాలు ఎక్కువగా ఉడికిపోవచ్చు.. మరికొన్ని సరిగ్గా ఉడకకపోవచ్చు. వంటకం రకాన్ని బట్టి పదార్థాలను సరైన క్రమంలో వేయాలి.

వంట చేస్తున్నప్పుడు పదే పదే మూత తీయడం

కూర, అన్నం లేదా ఇతర వంటకాలు ఉడుకుతున్నప్పుడు పదే పదే మూత తీసి చూడడం వల్ల లోపల వేడి, ఆవిరి బయటకు వెళ్లిపోతాయి. దీంతో వంట పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే మూత తీసి చూడడం మంచిది.

55
మాంసాన్ని ఎక్కువ సేపు ఉడికించొద్దు

చికెన్ లేదా మటన్‌ను ఎక్కువసేపు ఎక్కువ మంటపై ఉడికిస్తే మాంసం గట్టిగా మారే అవకాశం ఉంటుంది. వంటకం రకాన్ని బట్టి సరైన మంటపై ఉడికించడం వల్ల మాంసం మెత్తగా, రుచిగా ఉంటుంది.

వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయటే ఉంచడం

వంట పూర్తయిన తర్వాత ఆహారాన్ని గంటల తరబడి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా వేడి వాతావరణంలో ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆహారాన్ని సరైన విధంగా చల్లార్చి.. అవసరమైతే రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచాలి.

Read more Photos on
click me!

Recommended Stories