మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. జర గమనించండి

Published : Jan 03, 2023, 10:57 AM IST

మూత్రపిండాల్లో రాళ్లు వివిధ కారణాల వల్ల ఏర్పడుతుంటాయి. అయితే చాలా మంది ఈ రాళ్లు ఎక్కువైన తర్వాతే లక్షణాలను గమనిస్తారు. కానీ ఈ రాళ్లు ఏర్పడిన స్టార్టింగ్ లోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తే.. వీటి నుంచి బయటపడటం సులువు అవుతుంది. 

PREV
16
 మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. జర గమనించండి
kidney stone

మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కలిగే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూత్రపిండాల్లో రాళ్ళు.. యూరిక్ ఆమ్లం, కాల్షియం ఆక్సలేట్ , ఖనిజాలు, ఫాస్పరస్ వల్ల ఏర్పడతాయి. 

ఆహారం, ఓవర్ వెయిట్, కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని మందులతో పాటుగా ఎన్నో కారకాలు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తాయి. అయితే ఈ సమస్య తీవ్రతను బట్టి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారొచ్చు. అసలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26
kidney health

విపరీతమైన నొప్పి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రాశయాలలో అభివృద్ధి చెందుతున్న రాళ్ళు మూత్ర ప్రవాహాన్ని ఆపుతాయి. అలాగే మూత్రపిండాలు ఉబ్బుతాయి. దీనివల్ల భరించలేని నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు పక్కటెముకల కింద విపరీతమైన నొప్పి కలుగుతుంది. అలాగే పక్కటెముకల వెనుక భాగంలో కూడా ఈ నొప్పి వస్తుంది. అంతేకాదు పొత్తికడుపు, గజ్జల్లో కూడా భరించలేని నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఒక్కోసారి ఎక్కువగా, ఒక్కోసారి తక్కువగా వస్తుంది. లేదా మూత్రవిసర్జన చేసేటప్పుడు మండుతున్న అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ మూత్రపిండాల్లో రాళ్లను సూచిస్తాయి.
 

36

మూత్ర సమస్యలు

మూత్రపిండాల్లో రాళ్ళు మూత్రవిసర్జన సమస్యలను కూడా కలిగిస్తాయి. అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం, మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా మూత్ర విసర్జన చేయలేకపోవడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ ను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
 

 

46

మూత్రంలో రక్తం

మూత్రపిండాల్లో రాళ్లున్న కొంతమందికి మూత్రంలో రక్తం వస్తుంది కూడా. దీనిని 'హెమటూరియా' అని కూడా అంటారు. అంటే వీరిలో మూత్రం సాధారణంగా గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటుంది. అయితే మూత్రంలో రక్తం వస్తుందనేది కేవలం మూత్ర పరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. 
 

56

జ్వరం, వికారం, వాంతులు

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు వికారం, వాంతులు వంటి కొన్ని సాధారణ లక్షణాలు కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారికి సంక్రమణ ఉంటే జ్వరం వస్తుంది. అలాగే విపరీతమైన చలి పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

 

66

డాక్టర్ ను ఎప్పుడు కలవాలి

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయో లేవో..?  తెలుసుకోవడానికి క్రమ తప్పకుండా తనిఖీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ సమస్య మరింత తీవ్రతరం అయితే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి. 

భరించలేని నొప్పి కలిగినప్పుడు

నొప్పి వికారం, వాంతులతో వచ్చినప్పుడు

ఈ నొప్పి జ్వరం, చలితో పాటు వచ్చినప్పుడు 

మూత్రంలో రక్తం

మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది

 

Read more Photos on
click me!

Recommended Stories