పీరియడ్స్ టైంలో దాల్చిన చెక్కను తీసుకుంటే ఎంత మంచిదో తెలుసా?

First Published Jan 2, 2023, 4:56 PM IST

దాల్చిన చెక్క మన శరీరాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీనిని పీరియడ్స్ సమయంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Image: Getty Images

ప్రతి వంట గదిలో దాల్చిన చెక్క కచ్చితంగా ఉంటుంది. ఇది ఒక మసాలా దినుసే అయినా.. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే చాలా మంది దీనిని ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగిస్తుంటారు. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్, కార్భోహైడ్రేట్లు, విటమిన్లు,  ప్రోటీన్లు, ఇనుము, భాస్వరం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ దాల్చిన చెక్క మన శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఈ దాల్చినచెక్క మహిళలకు మంచి మెడిసిన్ కంటే తక్కువేం కాదు. ఎందుకంటే ఇది వీళ్లలో ఎన్నో సమస్యల నుంచి  ఉపశమనం కలిగిస్తుంది. ఈ మసాలా దినుసు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది కండరాల మంటను కూడా తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. 

cinnamon


ఆడవారికి దాల్చినచెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

దాల్చిన చెక్కలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. అలాగే పీరియడ్స్ సక్రమంగా అయ్యేలా చేస్తాయి.  


దాల్చినచెక్క వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 


పీరియడ్స్ సమయంలో భరించలేని పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, కడుపు ఉబ్బరం, రాకు వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం దాల్చినచెక్కతో పాటుగా తేనెను తీసుకోండి. 


దాల్చినచెక్కలో ఉండే యూజీనాల్ పీరియడ్స్ సమయంలో సమస్యలను కలిగించే హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.


దాల్చిన చెక్క పీరియడ్స్ తిమ్మిరిని, ఇతర PMS లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి? 

రుతుస్రావం సమయంలో చాలా మంది ఆడవారికి పొత్తి కడుపులో  భరించలేని నొప్పి వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు దిగువ భాగంలో.. అలాగే వాంతులు, మైకము, విరేచనాలు, వికారం, బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి సమయంలో దాల్చిన చెక్క నీటిని తాగితే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 

దాల్చిని ఉపయోగించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం.. గోరువెచ్చని గ్లాస్ పాలలో దాల్చినచెక్క పొడిని కలిపి తాగండి. కావాలనుకుంటే ఈ పౌడర్ తో టీ ని కూడా తయారు చేసుకుని తాగొచ్చు.
 

cinnamon tea

నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి

కొన్ని కొన్ని సార్లు పీరియడ్స్ సమయంలో నొప్పి భరించలేని విధంగా వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు దాల్చినచెక్కతో చేసిన మూలికా టీ తాగండి. లేదా దాల్చినచెక్క నూనెతో కడుపుపై మసాజ్ చేయండి. దీనివల్ల వాపు, తీవ్రమైన నొప్పి తగ్గిపోతాయి.
 

విపరీతమైన రక్తస్రావం 

కొంతమందికి పీరియడ్స్ సమయంలో మోతాదుకు మించి రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. దీనివల్ల అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు ఇలాంటి వారికి భరించలేని నొప్పి, బలహీనత, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. వీరు దాల్చినచెక్క తీసుకోవడం వల్ల రక్తస్రావం ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉండదు. 

click me!