KFC: ఈ పేస్ట్‌తో బ్రష్‌ చేస్తే చికెన్‌ తిన్నట్లే ఉంటుంది.. KFC చికెన్‌ ఫ్లెవర్‌ టూత్‌ పేస్ట్‌

Published : Apr 12, 2025, 05:00 PM ISTUpdated : Apr 12, 2025, 05:02 PM IST

నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంలో ఒక్కరోజైనా చికెన్‌ ఉండాల్సిందే. ఇక కేఎఫ్‌సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కేఎఫ్‌సీ చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే తాజాగా నాన్‌ వెజ్‌ ప్రియులకు కేఎఫ్‌సీ అదిరిపోయే ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. మొట్టమొదటిసారి చికెన్‌ ఫ్రై ఫ్లెవర్‌తో కూడిన టూత్ పేస్ట్‌ను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
KFC: ఈ పేస్ట్‌తో బ్రష్‌ చేస్తే చికెన్‌ తిన్నట్లే ఉంటుంది.. KFC చికెన్‌ ఫ్లెవర్‌ టూత్‌ పేస్ట్‌

ప్రముఖ చికెన్‌ రెస్టారంట్‌ కేఎఫ్‌సీ, హై స్మైల్‌ కంపెనీతో కలిసి ఓ సరికొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చికెన్‌ ఫ్లేవర్‌తో కూడిన టూత్‌ పేస్ట్‌ను లాంచ్‌ చేశారు. ఇది ఒరిజినల్ చికెన్ రెసిపీతో తయారైంది. ఈ టూత్‌పేస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒరిజినల్ చికెన్ రెసిపీతో తయారైంది. ప్రస్తుతానికి దీని ప్రొడక్షన్ లిమిటెడ్‌గా ఉంది. మార్కెట్‌లో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలని ఇలా చేశారు.
 

25
fried chicken flavored toothpaste by KFC

KFC ఫ్రైడ్ చికెన్ ఫ్లేవర్ టూత్‌పేస్ట్ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. నాన్ వెజ్ ఫ్లేవర్ టూత్‌పేస్ట్ మార్కెట్‌లోకి రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇప్పటి వరకు క్లోవ్‌, లెమన్‌, సాల్ట్‌ ఇలాంటి వెజ్‌ ఫ్లేవర్స్‌ టూత్‌ పేస్ట్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తొలిసారి ఇలా నాన్‌ వెజ్‌ ఫ్లెవర్‌తో టూత్‌పేస్ట్‌ను లాంచ్‌ చేశారు. ఈ పేస్ట్‌ను టూత్‌పేస్ట్ బ్రాండ్ 'Hismile'తో కలిసి తయారు చేశారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం ఇందులో KFC స్పెషల్ 11 రకాల హెర్బ్స్ వాడారు. మసాలాలతో చేసిన ఈ టూత్‌పేస్ట్ మీ రోజును ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తుంది.

35
Man tries KFC's fried-chicken

KFC చికెన్ టూత్‌పేస్ట్‌లో ఏం వాడారో ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. కానీ ఇందులో వాడిన 11 హెర్బ్స్‌లో ఉప్పు, తులసి, వాము, సెలెరీ, నల్ల మిరియాలు, ఆవాలు, క్యాప్సికమ్, వెల్లుల్లి ఉప్పు, అల్లం పొడి, తెల్ల మిరియాలు ఉన్నాయని అంటున్నారు. ఈ హెర్బ్స్‌తో నిండిన పేస్ట్ దంతాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. KFC ఒరిజినల్ రెసిపీ చికెన్ టేస్ట్ ఉన్న ఈ టూత్‌పేస్ట్ మీ నాలుకకు రుచిని ఇవ్వడమే కాకుండా నోటిని ఫ్రెష్‌గా ఉంచుతుందని అంటున్నారు. 

45

ఈ టూత్‌పేస్ట్‌ను Hismile వెబ్‌సైట్‌లో లిమిటెడ్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పేస్ట్‌ ధర రూ. 1120గా నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో తీసుకొచ్చిన ఈ టూత్‌ పేస్ట్‌లు మొత్తం కేవలం 48 గంటల్లోనే అమ్ముడుపోయాయి. రకరకాల ఫ్లేవర్స్‌తో కూడిన టూత్‌ పేస్ట్‌లను తీసుకురావడంలో పేరు సంపాదించుకుంది హాయ్‌స్మైల్‌ కంపెనీ. చికెన్ ఫ్లేవర్‌తో పాటు ఈ కంపెనీ ఐస్డ్ లాటే, చుపా చుప్స్ కోలా, రెడ్ వెల్వెట్ లాంటి వేరే ఫ్లేవర్స్ పేస్ట్‌లను కూడా తయారు చేసింది. ఇందులో ఐస్ పాప్, కుకీస్ అండ్ క్రీమ్, హేజెల్‌నట్ స్ప్రెడ్, స్ట్రాబెర్రీ క్రీమ్ యోచి కూడా ఉన్నాయి.
 

55
brushing

Hismile మార్కెటింగ్ మేనేజర్ కోబన్ జోన్స్ మాట్లాడుతూ.. 'కంపెనీ ఇప్పటి వరకు తీసుకొచ్చిన టూత్‌ పేస్ట్‌లలో ఇది బెస్ట్‌ ప్రొడక్ట్‌. KFC ఫేమస్ టేస్ట్స్‌ను డైలీ అవసరాల్లో కలిపేందుకు ఇంతకంటే మంచి దారి ఏముంటుంది? ఆసక్తికర విషయం ఏంటంటే ఈ టూత్‌పేస్ట్‌లో ఫ్లోరైడ్ లేదు. దీంతో దంతాల ఆరోగ్యానికి కూడా ఈ టూత్‌పేస్ట్‌తో ఎలాంటి ఢోకా ఉండదన్నమాట. 

Read more Photos on
click me!

Recommended Stories