Chanakya Tips For Kids: పిల్లల భవిష్యత్తును మార్చే 7 చాణక్య జీవిత సూత్రాలు.. తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి!

Published : Apr 12, 2025, 04:17 PM IST

Chanakya Tips For Kids: విజ‌య‌వంత‌మైన జీవితం కొన‌సాగించ‌డానికి ఆచార్య చాణ‌క్య త‌న నీతి సూక్తుల‌లో అనేక విష‌యాలు వివ‌రించారు. అలాగే, త‌మ పిల్ల‌లు ఓట‌మి లేకుండా స‌క్సెస్ ఫుల్ లైఫ్ ను సాధించ‌డానికి 7 జీవిత సూత్రాలు చెప్పారు చాణ‌క్య‌. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
Chanakya Tips For Kids:  పిల్లల భవిష్యత్తును మార్చే 7 చాణక్య జీవిత సూత్రాలు.. తల్లిదండ్రులు తప్పక నేర్పించాలి!
7 Chanakya life principles that will change the future of children

Chanakya Tips For Kids: చాణక్య నీతి ప్రకారం పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే జీవిత‌ పాఠాలతో పాటు మంచి అలవాట్లు, నిజాయితీ, కృషి వంటి విలువల్ని నేర్పించాలి. ఆచార్య చాణక్య చెప్పిన కొన్ని జీవిత సూత్రాలను పాటించడం ద్వారా పిల్లలు జీవితంలో విజయాలు సాధించగలరు, ఓటములను అధిగమించగలరు.

ఈ సూత్రాలు పిల్లలలో మెరుగైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి. పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు త‌ప్ప‌కుండా నేర్పించాల్సిన‌, ఆచార్య‌ చాణ‌క్య చెప్పిన 7 సూత్రాలు వివ‌రాలు ఇలా ఉన్నాయి..  

25
7 Chanakya life principles that will change the future of children.. Parents must teach them

1. జ్ఞానం సంపదకంటే ముఖ్యమని మీరు మీ పిల్ల‌ల‌కు చెప్పండి. ఎందుకంటే మ‌న‌కు కోట్లాది సంప‌ద ఉన్నా ఒకానొక స‌మ‌యంలో డబ్బు నశించొచ్చు కానీ జ్ఞానం జీవితాంతం తోడుంటుంది. మీరు మీ జీవితాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగించ‌డంలో కీల‌కంగా ఉంటుంది. 

2. నిజాయితీగా జీవించాలని కూడా మీరు మీ పిల్ల‌ల‌కు చెప్పండి. అబద్ధం తాత్కాలికంగా సంతోషం ఇచ్చినా, దీర్ఘకాలంలో నష్టాల‌నే ఇస్తాయి. కాబ‌ట్టి ఇది మీ జీవితాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని మీ పిల్ల‌ల‌కు వివ‌రించండి.

35
7 Chanakya life principles for children

3. కోపాన్ని నియంత్రించుకునేలా మీ పిల్ల‌ల‌ను పెంచండి. ఎందుకంటే కోపం వల్ల సంబంధాలు నాశనం అవుతాయి. విజయవంతమైన జీవితానికి ప్రశాంతంగా ఆలోచించడం అవసరం.

4. మంచివారితో స్నేహిం చేయాలి ఎందుకంటే చెడు అలవాట్లున్న వారితో స్నేహం మిమ్మల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. మంచి వారు మార్గదర్శకులవుతారని ఆచార్య చాణక్య తన నీతి సూక్తులలో చెప్పారు. అందుకే మంచివారితో స్నేహం చేయాలి. అప్పుడు జీవితంలో మరిన్ని విజయాలు అందుకుంటాం.

45
chanakya niti

5. కష్టపడితేనే విజయాన్ని పొందగలమని తల్లిదండ్రులు పిల్లలు చెప్పాలి. సోమరితనం ఓటమికి దారి తీస్తుంది. శ్రమ అంటే కష్టపడితేనే విజయం దక్కుతుంది. ఈజీగా ఎప్పుడూ కూడా సక్సెస్ రాదని విషయాన్ని పిల్లలకు నేర్పించాలి.

6. డబ్బును బాధ్యతగా వినియోగించడం కూడా పిల్లలకు నేర్పించాలి. జీవితంలో డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. డబ్బు విలువను అర్థం చేసుకుని వృథా చేయకుండా ఉంటే అలవాట్లను పిల్లలకు నేర్పించాలి. 

55
7 Chanakya life principles that will change childrens future


7. తప్పులనుంచి నేర్చుకోవాలనే విషయాలు కూడా పిల్లలకు చెప్పాలి. ఓటమిని జీవితాంతం భరించకూడదు, ఆ అనుభవాలనుండి ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో విజయాలు అందుకుంటాం. 

Read more Photos on
click me!

Recommended Stories